»   » టాలీవుడ్ బాక్సాఫీస్: సంక్రాంతి రారాజు ఎవరో తేలి పోయింది!

టాలీవుడ్ బాక్సాఫీస్: సంక్రాంతి రారాజు ఎవరో తేలి పోయింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సారి సంక్రాంతి బాక్సాఫీసు రేసులో నాలుగు సినిమాలు పోటా పోటీగా విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో', బాలయ్య నటించిన ‘డిక్టేటర్', నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా', శర్వానంద్ ‘ఎక్స్ ప్రెస్ రాజా' విడుదలయ్యాయి. విడుదలైన ఈ నాలుగు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో అన్ని సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

అయితే ఈ సంక్రాంతి రేసులో రారాజుగా నిలిచేది బాలయ్య లేదా ఎన్టీఆర్ అని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా ఈ ఇద్దరినీ బీట్ చేసి నాగార్జున నటించిన ‘సోగ్గేడే చిన్నినాయనా' చిత్రం ముందు ఉంది. అటు ప్రేక్షకుల స్పందన పరంగా, విమర్శకుల రివ్యూల పరంగా టాప్ రేటింగ్ నాగార్జున సినిమాకే దక్కింది. దీంతో ఈ సంక్రాంతి రారాజు నాగార్జునే అంటున్నారంతా.

 Tollywood Sankranthi King Nagarjuna

‘మనం' సినిమా తర్వాత నాగార్జున తన సొంత బేనర్లో ఆ స్థాయిలో హిట్ అందుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా ఎఫెక్టుతో ఆయన తర్వాతి సినిమా ‘ఊపిరి'పై అంచనాలు భారీగా పెరిగాయి.

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ‘ఊపిరి' చిత్రంలో తమిళ స్టార్ కార్తి కూడా నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ఇప్పటి నుండే బయ్యర్లు పోటీ పడుతున్నారు. ఊపిరి చిత్రాన్ని మరో నెల రోజుల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్' కి రీమేక్ గా ఊపిరి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క - అడవి శేష్ జంటగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే విదేశాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు.

English summary
While everyone expected 'Nannaku Prematho' and 'Dictator' to vie for the top honors this Pongal, it is 'King' Nagarjuna who beat the competition by a mile.‘Soggade Chinni Nayana’ has set the box-office on fire and been declared a unanimous blockbuster universally.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu