Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. హరనాథ్ కూతురు హఠాన్మరణం!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విలువలున్న నిర్మాతగా గుర్తింపును అందుకున్న జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. పద్మజ వయసు 54 సంవత్సరాలు. ఇండస్ట్రీలో అందరితోను స్నేహపూర్వకంగా ఉన్న ఆమె హఠాత్తుగా మరణించడంతో ఒక్కసారిగా విషధచాయలు అలుముకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల హీరోగా అప్పట్లో మంచి గుర్తింపును అందుకున్న హరనాథ్ కు పద్మజా రాజు కూతురు అని అందరికి తెలిసిన విషయమే.
అప్పట్లో కొంతకాలం పాటు ఆమె ఇండస్ట్రీలో చాలా చురుగ్గా కనిపించారు. ఆమె సోదరుడు శ్రీనివాసరాజు కూడా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగారు. పద్మజకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక పద్మజా రాజు సినిమా కెరీర్ లోకి వెళితే.. నిర్మాతగా ఆమె తన భర్త జి.వి.జి.రాజుతో కలిసి పలు మంచి సినిమాలను నిర్మించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో "గోకులంలో సీత, తొలిప్రేమ" సినిమాలు నిర్మించారు. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా 'గోదావరి' అనే సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవల పద్మజారాజు తన తండ్రి హరనాథ్ గురించి 'అందాలనటుడు' అనే పేరుతో ఓ పుస్తకం తీసుకు వచ్చారు. ఆ పుస్తకాన్ని నటశేఖర కృష్ణ చేతుల మీదుగా కూడా విడుదల చేశారు. వారి కుటుంబానికి కృష్ణ గారితో మంచి అనుబంధం ఉంది.
పద్మజ చివరి ఇంటర్వ్యూలో.. తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా ఇండస్ట్రీలోకి రాన్నారనీ కూడా ఆమె తెలిపారు. ఇక వచ్చే సంవత్సరం అతను నిర్మాతగా సినిమాను ప్లాన్ చేయాలని అనుకుంటున్న తరుణంలో పద్మజ కన్నుమూయడం విచారకరం. ఇక ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే జీవీజీ రాజు కుటుంబానికి కుమారులకు మనో ధైర్యం లభించాలని పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.