twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంతాపం: టాలీవుడ్ బంద్ పిలుపు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ నిర్మాత రామానాయుడు మృతి చెందిన నేపథ్యంలో రేపు(ఫిబ్రవరి 19) తెలుగు చిత్ర సీమకు బంద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి అపీషియల్ ప్రకటన వెలువడింది. గురువారం తెలుగు చిత్రసీమకు సంబంధించిన షూటింగులు అన్ని నిలిపి వేయనున్నారు.

    సినీ పరిశ్రమకు చెందిన వారంతా రేపు ఉదయం 9 గంటలకు రామానాయుడు స్టూడియోకు చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు. రామానాయుడు తనయుడు వెంకటేస్ బుధవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చిన తన తండ్రి రామానాయుడు మరణించిన విషయాన్ని ప్రకటించారు.

    ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Tollywood shut down

    నాన్నగారు ప్రశాంతంగా వెళ్లారని వెంకటేష్ అన్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు నాన్నగారు తుది శ్వాస విడిచినట్లు ఆయన తెలిపారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి రామానాయుడి స్టూడియోలో అభిమానుల దర్శనార్థం నాన్నగారి భౌతిక కాయాన్ని ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం సాయంత్రం 3 గంటల తర్వాత అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు.

    కాగా, రామానాయుడి స్వగ్రామం కారంచేడు నుంచి బంధువులు, అభిమానులు హైదరాబాదుకు బయలుదేరారు. తమ అభిమాన నిర్మాతను కడసారి చూడడానికి వారు హైదరాబాదుకు బయలుదేరారు. ప్రకాశం జిల్లా కారంచేడులో విషాద ఛాయలు నెలకొన్నాయి. రామానాయుడు మించిన నిర్మాత తెలుగులో లేరు. చిత్ర సీమ అంతా ఆయనను విశేష గౌరవంతో ఆదరిస్తూ వచ్చారు. తన పేరు మీద ఓ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. అవార్డులు, గౌరవ పురస్కారాలు ఆయన ఎన్నో అందుకున్నారు. ఓ నిర్మాతకు స్టార్ డమ్ రావడం రామానాయుడి విషయంలోనే జరిగింది.

    English summary
    Andhra Pradesh Film Chamber of Commerce declared Telugu Film Industry will remain closed Tomorrow as a mark of respect to Movie Moghul Dr. D. Ramanaidu who passed away Today. The Film Body also expressed grief at the sudden demise of the Icon of Telugu Cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X