For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైంగిక వేధింపులపై తమన్నా, తాప్సీ, అమలాపాల్, రకుల్‌ స్పందన

By Srikanya
|

హైదరబాద్ : మళయాళి నటి కిడ్నాప్, లైంగిక వేధింపులు విషయమై గత కొద్ది రోజులుగా మీడియాలో ఓ రేంజిలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సినీ సెలబ్రెటీలు తనదైన శైలిలో స్పందిస్తున్నారు. , లైంగిక వేధింపులు, అత్యాచారాలు వంటి అరాచకాల సంస్కృతికి ఇకనైనా విడనాడండి అంటున్నారు.

మహిళా వేధింపుల గురించి స్టార్ హీరోయిన్స్ తమన్నా, తాప్సీ, అమలాపాల్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ లాంటి వారు ఎలా స్పందిస్తున్నారో చూద్దాం. వారు తమ మనోభావాలను చాలా స్పష్టంగా మీడియాతో పంచుకున్నారు. చిన్న చూపు చూడవద్దని చెప్తున్నారు. ఆడవాళ్లు సైతం చివరి వరకూ పోరాడాలని పిలుపు ఇస్తున్నారు.

ఎన్నో చేదు అనుభవాలంటూ..

ఎన్నో చేదు అనుభవాలంటూ..

సమాజంలో ప్రతి మహిళ శారీరకంగా, మానసికంగా ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంటూనే ఉంటుంది. బస్సుల్లో పయనిస్తున్నప్పుడు, రోడ్డుపై నడుస్తున్నప్పు డు, అసభ్యకరమైన సంఘటనల గురించి వారు బయటకు చెప్పుకోలేరన్న ధైర్యమే మగవారి దుశ్చర్యలు కొనసాగడానికి కారణం. అయితే స్త్రీలు వారి ఆగడాలను ధైర్యంగా ఎదిరించాలి. అప్పుడే ఆడవారిపై అత్యాచారాలు, నేరాలు తగ్గుతాయి.ఇకపై మగువలకు తల దించుకునే పరిస్థితి తలెత్తకూడదు. ఇతరుల కోసం మన ఇష్టాలను, కలలను హరించుకోకూడదు. చరిత్రలో ఉన్నతమైన స్త్రీలను స్ఫూర్తిగా తీసుకుని నేటి మహిళ ప్రగతి పథంలో సాగాలి అని హీరోయిన్ తాప్సీ పేర్కొన్నారు.

చిన్న చూపు వద్దు

చిన్న చూపు వద్దు

మహిళలను ఇప్పటికీ చాలా మంది చిన్న చూపు చూస్తున్నారు. సున్నితంగా ప్రవర్తిం చడం, నిజాయితీగా నడుచుకోవడం మహిళల బలహీనతగా భావిస్తున్నారు. కానీ అవే వారి బలం అని గుర్తెరగాలి. నా జీవితం చాలా పాఠాలు నేర్పింది. కొన్ని అపజయాలు జీవితాన్నే మార్చేస్తాయి. అలాంటివి నా జీవిత మలుపునకు కారణం అయ్యాయి. ఓటమిని గెలవడానికి చివరి వరకూ పోరాడే వారంటే నాకు గౌరవం అని నటి అమలాపాల్‌ పేర్కొన్నారు.

తమన్నాఏమంటోందంటే...

తమన్నాఏమంటోందంటే...

గతంతో పోల్చుకుంటే మహిళల్లో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందులా వారు అణగదొక్కబడడం లేదు. సినిమాల్లో కూడా స్వాతంత్య్రం లభిస్తోంది. ఇక్కడ హీరోయన్స్ ను ఉన్నతంగా చూపిస్తున్నారు. ఒకప్పుడులా ఫలాన దుస్తులే ధరించాలన్న ఒత్తిడి ఇప్పుడు లేదు. నాకు డ్రస్‌ సౌకర్యంగా లేకపోతే వాటిని ధరించను. మహిళలు ఆత్మాభిమానాన్ని కోల్పోరాదు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్లను ఒకరు ఇస్తే పొందకూడదు. మనమే సాధించుకోవాలి అని నటి తమన్నా పేర్కొన్నారు.

రకుల్ ప్రీతి సింగ్ ఏమంటారంటే...

రకుల్ ప్రీతి సింగ్ ఏమంటారంటే...

ఇటీవల మళయాళి నటి లైంగిక వేధింపులకు గురైన సంఘటన మనసును బాధించింది. మమ్మల్ని మనుషులుగా భావించండి. స్త్రీలు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. చాలా భయానక సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి వాటి నుంచి మహిళలు తమను తాము కా పాడుకోవాలి. అందుకు మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలి అని నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు.

English summary
The recent incident of a Malayalam actress' abduction and molestation has sent shock waves across the country. star Heroines from the South film industry had also expressed their anger towards the incident with posts on social media.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more