twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ 'స్టార్ నైట్' హైలెట్స్ ఏంటంటే...

    By Srikanya
    |

    యమధర్మరాజు గెటప్‌ ధరించిన ఎన్‌టీఆర్‌ గుక్క తిప్పుకోకుండా చెప్పిన డైలాగులకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. వరదబాధితులను ఆదుకొనేందుకు 'స్పందన' పేరుతో తెలుగు చిత్రపరిశ్రమ శనివారం సాయంత్రం నిర్వహించిన స్టార్‌నైట్‌ బాగా సక్సెస్ అయింది. స్టార్స్ ఆటపాటలతో, హాస్య నాటికల ప్రదర్శనతో అయిదున్నర గంటల పాటు సాగిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరినీ అలరించింది.పి.సుసీల ప్రార్ధనతో మొదలైన ఈ కార్యక్రమం పలువురు సంగీత దర్శకుల పాటలతో ఊపందుకుంది. కీరవాణి స్వరపరిచిన ధీమ్ సాంగ్ పాటకు చలన చిత్ర పరిశ్రమలోని అగ్ర తారలంతా కలసి నటించారు.

    అలాగే హీరో సిద్దార్థ్‌ 'బొమ్మరిల్లు' 'అపుడో ఎపుడో' పాట పాడి అభినయించడమే కాకుండా ఆ సినిమాలో తనతో పాటు నటించిన జెనీలియా, ప్రకాష్‌రాజ్‌, జయసుధలను కూడా వేదికపైకి ఆహ్వానించి వారితో కూడా స్టెప్పులేయించారు.

    జూనియర్‌ ఎన్‌టీఆర్‌ ప్రదర్శించిన 'యమదొంగ' ఎపిసోడ్‌, 'లక్స్‌ పాపా' అంటూ బాలకృష్ణ చేసిన నృత్యం, మోహన్‌బాబు, జయసుధ, రోజా పాల్గొన్న హాస్పిటల్‌ ఎపిసోడ్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా వేణుమాధవ్‌, సుమ తదితరులు ప్రదర్శించిన 'మ్యారేజ్‌ రిసెప్షన్‌' హాస్య నాటికకు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

    దాసరి తెర వెనక నుంచి వ్యాఖ్యానం అందించారు.రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ ఒకేచోట కూర్చోవటం అందరినీ అలరించింది.ఇక చిరంజీవి ఘరానా మొగడులోని బంగారు కోడిపెట్ట పాట ఎస్పీ ఆలపిస్తుంటే బలకృష్ణ దాన్ని హమ్ చేస్తూ కనపించారు. ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ లోని పుణ్యభూమి నాదేశం పాటను వేదికపై బాలు పాడుతూంటే..ఎన్టీఆర్ ని అనుకరిస్తూ మోహన్ బాబు హావ భావాలు ప్రదర్సించారు.

    దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఎక్స్ క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న పాటను సుహాసిని మణిరత్నం దేవీతో కలిసి ఆలపించారు. మధ్యలో శ్రియ వచ్చి డాన్స్ చేసారు. ఇక మమతామోహన్ దాస్ తో కలిసి ఆకలేస్తే అన్నం పెడతా, రాఖీ..రాఖీ పాటలను దేవీ డాన్స్ చేసారు. ఇంకా ఈ కార్యక్రమలో రాజశేఖర్‌, నవీన్‌, విష్ణు, నవదీప్‌, వరుణ్‌ సందేశ్‌, రోహిత్‌, నాని, తనీష్‌, రాజా, శ్రియ, వేదిక, నవనీత్‌ కౌర్‌, కామ్న జెఠ్మలానీ, కావేరి ఝా, సంగీత, పూనంకౌర్‌ , ప్రియమణి పాల్గొన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X