»   » డ్రగ్స్ ఇష్యూ : పిచ్చి పిచ్చిగా అడగొద్దంటూ యాంకర్ మీద అరిచిన రానా!

డ్రగ్స్ ఇష్యూ : పిచ్చి పిచ్చిగా అడగొద్దంటూ యాంకర్ మీద అరిచిన రానా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కొన్ని రోజులుగా డ్రగ్స్ కేసు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. చాలా వరకు డ్రగ్స్ విదేశాల నుండి పార్శల్స్ రూపంలో వస్తున్నాయని గ్రహించిన అధికారులు నిఘా పెట్టారు. ఇటీవల రామానాయుడు స్టూడియోకి విదేశాల నుండి హీరో రానా పేరు మీద పార్సిల్ రావడంతో ఎక్సైజ్ శాఖ సీఐ పరిశీలించేందుకు వెల్లడం చర్చనీయాంశం అయింది.

ప్రస్తుతం 'నేను రాజు నేనే మంత్రి' సినిమా ప్రమోషన్లలో భాగంగా టీవీ 9 ఇంటర్వ్యూలో పాల్గొన్న రానాకు డ్రగ్స్ కేసు, రామానాయుడు స్టూడియోకు వచ్చిన పార్శిల్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

యాంకర్ మీద అరిచిన రానా

యాంకర్ మీద అరిచిన రానా

డ్రగ్స్ వ్యవహారం గురించి, రామానాయుడు స్టూడియోకు వచ్చిన పార్శల్ గురించి అడగ్గానే రానా... ఆగ్రహంతో ఊగిపోయారు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయద్దంటూ యాంకర్ మీద అరిచాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Bigg Boss Telugu : Sameer Got Eliminated By Rana Daggubati
పబ్లిసిటీ స్టంటేనా?

పబ్లిసిటీ స్టంటేనా?

అయితే రానా ఆగ్రహంతో అరవడం పబ్లిసిటీ స్టంటే అని స్పష్టమవుతోంది. తాను అరిచిన వీడియో సెన్సేషన్ కావాలనే ఉద్దేశ్యంతో రానా.... లేని కోపాన్ని తెచ్చుకుని ఇలా అరిచినట్లు అతడి మొహంలో ఎక్స్ ప్రెషన్స్ చూస్తే స్పష్టమవుతోంది.

ఆ పార్శల్ ఓపెన్ చేసి చూపించాను

ఆ పార్శల్ ఓపెన్ చేసి చూపించాను

ఆ పార్శల్ మీద రానా స్పందిస్తూ.... ఆ పార్శల్ గురించి నన్ను పిలిపించారు. నా పేరు మీద వచ్చింది కాబట్టి నేనే ఓపెన్ చేయాలని కోరారు. వారు అడిగినట్లే పార్శల్ విప్పి చూపించాను. అందులో విదేశాల నుండి వెన్ను నొప్పి తగ్గించుకోవడానికి తెప్పించుకున్న పరికరం ఉంది. ఈ విషయాన్ని ఫోటో తీసి అందరికీ షేర్ చేశాను అని రానా తెలిపారు.

డబ్బు కోసం కాదు...

డబ్బు కోసం కాదు...

నేను సినిమాలు, టీవీ షోలు డబ్బు కోసం చేయడం లేదు. నా గత మూడు సినిమాలకు డబ్బులే తీసుకోలేదు. బయటి నుండి డబ్బులు తీసుకొచ్చి నేను చేసే సినిమాల్లో పెడుతుంటాను అని రానా తెలిపారు.

నేను హీరోను అని ఎప్పుడూ చెప్పుకోలేదు

నేను హీరోను అని ఎప్పుడూ చెప్పుకోలేదు

నేను హీరో అని ఎప్పుడూ చెప్పుకోలేదు. నేను సినిమాల్లో పని చేస్తున్నాను. అందులో చాలా అంశాలు ఉంటాయి. అందులో చేసే ఒక భాగం హీరో. ఎవరైనా ఏమైనా అనుకుంటే సంబంధం లేదు అని రానా తెలిపారు.

పాలిటిక్స్‌లోకి

పాలిటిక్స్‌లోకి

పాలిటిక్స్‌లోకి వెళ్లే ఉద్దేశ్యం అస్సలు లేదు. నాకు డ్రామా అంటే ఇష్టం, సినిమా అంటే ఇష్టం, కథలు చెప్పడం ఇష్టం. పాలిటిక్స్ లో డ్రామా ఉంటుంది కాబట్టి ఆ కాన్సెప్టుతో సినిమా చేస్తున్నా అని రానా తెలిపారు.

English summary
Tollywood star Rana Daggubati got angry with TV9 anchor question and warned her. The anchor began asking a question alleging that Rana has a role in banned drugs case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu