twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2014 ఎన్నికల్లో పోటీకి సినీతారలు! (ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన తారలు తద్వారా సంపాదించుకున్న ప్రజాభిమానంతో రాజకీయాల్లో అడుగు పెడుతుండం కొత్తేమీ కాదు. కొన్ని దశాబ్దాల క్రితమే ఈ ఆనవాయితీ ప్రారంభమైంది. ప్రజలు కూడా తమ అభిమాన తారలను చట్టసభలకు పంపడానికి ఉత్సాహం ప్రదర్శిస్తుండటం కూడా ఇందుకు ఓ కారణం.

    తెలుగు సినిమా పరిశ్రమ విషయానికొస్తే ఎంతో మంది స్టార్స్ రాజకీయాల్లోకి ప్రవేశించినా...ప్రజా నాయకుడిగా ఉన్నత స్థానాన్ని అందుకున్న వ్యక్తి మాత్రం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు.

    రాబోయే 2014 ఎన్నికల్లో మరింత మంది సినీ తారలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తి నందమూరి బాలకృష్ణ. బాలయ్యతో పాటు మరికొందరు సినీ స్టార్స్ కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నారు.

    బాలకృష్ణ

    బాలకృష్ణ

    బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి పదవి చేపట్టినా...ఇప్పటి వరకు రాజకీయాలకు అంటీముట్టనట్లుగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడిప్పుడే ఆయన రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారుతున్నారు. తండ్రి స్థాపించిన తెలుగు దేశం పార్టీ తరుపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి పూర్తిగా రాజకీయాల్లోనే కొనసాగాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది త్వరలో తేలనుంది.

    శ్రీహరి

    శ్రీహరి

    ప్రముఖ నటుడు శ్రీహరి ఇప్పటి వరకు విలన్ పాత్రల్లో, హీరో పాత్రల్లో, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో నటించి రియల్ స్టార్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శ్రీహరి కూడా త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరుపున కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

    వివి వినాయక్

    వివి వినాయక్

    ప్రముఖ తెలుగు దర్శకుడు వివి వినాయక్ కూడా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారట. ఈ మేరకు ఆయన లాబీయింగ్ మొదలు పెట్టారని, వెస్ట్ గోదావరి జిల్లాలో ఏదో ఒక ప్రాంతం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీకి, అటు వైఎస్ఆర్ సీపీ నాయకులకు సన్నిహితంగా ఉంటున్న ఆయన మరి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది త్వరలోనే తేలే అవకాశం ఉంది.

    పూరి జగన్నాథ్ సోదరుడు

    పూరి జగన్నాథ్ సోదరుడు

    పూరి జగన్నాథ్ నేరుగా రాజకీయాల్లోకి రాక పోయినా...ఆయన అన్నయ్య గణేష్‌ వైఎస్ఆర్ సీపీలో చేరారు. గణేష్‌కు పూర్తి ఫుల్ సపోర్టుగా ఉంటున్నారు. వైఎస్ఆర్‌పై సినిమా తీసే ప్లాన్లో కూడా ఉన్నాడు పూరి. వచ్చే ఎన్నికల్లో గణేష్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అన్నయ్య తరుపున పూరి ప్రచారం చేయబోతున్నారట.

    వీరు కూడా...

    వీరు కూడా...

    ఇప్పటికే రాజకీయల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి, విజయశాంతి, దాసరి నారాయణరావు, మురళీ మోహన్, కోట శ్రీనివాసరావు, మోహన్ బాబు, కృష్ణం రాజు, సుమన్, రోజా, తదితరులు కూడా వచ్చే ఎన్నికల్లో తమదైన దారిలో ముందుకు సాగనునారు.

    English summary
    Tollywood stars are all set to create a bit of history of their own when Andhra Pradesh will go to polls next year. As many as 24 film personalities are lobbying for a chance to contest in 2014 elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X