»   » వీరంతా రూ. 50 కోట్ల సత్తా ఉన్న టాలీవుడ్ పోటుగాళ్లు!

వీరంతా రూ. 50 కోట్ల సత్తా ఉన్న టాలీవుడ్ పోటుగాళ్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ స్టార్లలో జూ ఎన్టీఆర్ కూడా ఒకరు. సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఆ మధ్య కొన్ని భారీ ప్లాపులు ఎన్టీఆర్ కెరీర్ చాలా స్లో అయ్యేలా చేసాయి. అయితే తారక ఇప్పటి వరకు రూ. 50 కోట్ల మార్కును మాత్రం అందుకోలేక పోయారు. చాలా కాలంగా ఎన్టీఆర్ రూ. 50 కోట్ల ఫీట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు ఎన్టీఆర్ కెరీర్లో రూ. 50 కోట్ల షేర్ వసూలు చేసే సినిమా వచ్చిపడింది. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన తాజా సినిమా ‘నాన్నకు ప్రేమతో' చిత్రం రూ. 50 కోట్ల మార్కకు చేరువైంది. త్వరలోనే ఈ చిత్రం రూ. 50 కోట్ల మార్కును అందుకోబోతోంది. ఈ చిత్రం రూ. 50 కోట్ల మార్కు అందుకున్న వెంటనే నిర్మాతలు ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరో వైపు ఎన్టీఆర్ అభిమానులు దీన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఒకప్పుడు కేవలం మాస్ హీరోగా మాత్రమే ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ క్రమక్రమంగా తన పంతా మార్చుకుంటూ క్లాస్ సినిమాలు సైతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ క్లాస్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇలా రెండు వర్గాల ప్రేక్షకులను బ్యాలెన్స్ చేయడం వల్లనే ఎన్టీఆర్ ఇపుడు రూ. 50 కోట్ల మర్కుకు చేరువయ్యాడని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇప్పటి వరకు టాలీవుడ్ రూ. 50 కోట్ల మార్కును అందుకున్న స్టార్స్ వివరాలు....

రామ్ చరణ్

రామ్ చరణ్


రామ్ చరణ్ తన కెరీర్లో తొలిసారిగా ‘మగధీర' సినిమాతో రూ. 50 కోట్ల మార్కను దాటారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 74 కోట్ల షేర్ వసూలు చేసింది. చాలా కాలం వరకు ఈ సినిమా రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేక పోయారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్' సినిమాతో రూ. 50 కోట్ల మార్కును అందుకున్నారు. ఈ చిత్రం రూ. 60 కోట్ల షేర్ సాధించింది. తర్వాత ఆయన నటించిన అత్తారింటికి దారేది రూ. 76 కోట్ల షేర్ సాధించింది.

మహేష్ బాబు

మహేష్ బాబు


మహేష్ బాబు ‘దూకుడు' సినిమా రూ. 59 కోట్ల షేర్ సాధించింది. ఇక ఆ తర్వాత వచ్చిన శ్రీమంతుడు రూ. 80 కోట్ల షేర్ సాధించింది.

అల్లు అర్జున్

అల్లు అర్జున్


అల్లు అర్జున్ ‘రేసు గుర్రం' చిత్రం రూ. 57 కోట్ల షేర్ సాధించింది. సన్నాప్ సత్యమూర్తి కూడా రూ. 50 కోట్లకు చేరువైంది.

ప్రభాస్

ప్రభాస్


బాహుబలి సినిమా ముందు వరకు ప్రభాస్ టాప్ లిస్టులో లేడు. కానీ ఈ చిత్రం తర్వాత టాప్ లిస్టులో పడ్డాడు. ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా షేర్ సాధించింది.

English summary
Check out List of highest-grossing Tollywood films.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu