Don't Miss!
- Sports
INDvsNZ : నువ్వూ.. నీ ఆట.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్!
- Technology
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- Finance
Wheat Price: సామాన్యులకు శుభవార్త.. తగ్గనున్న గోధుమ పిండి ధర..
- Automobiles
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- News
ఫ్లోరోసిస్ రక్కసిపై యుద్ధం చేసిన నల్గొండవాసి అంశాల స్వామి కన్నుమూత; కేటీఆర్ ట్వీట్!!
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
2022లో టాలీవుడ్ టాప్ గొడవలు.. మహేష్, సాయి పల్లవి మాటలతో ఊహించని వివాదాలు!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈసారి ఊహించిన విధంగా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా ఊహలకందని స్థాయిలో సక్సెస్ అవుతాయి అనుకున్న సినిమాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ఇక ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే కొంత మంది స్టార్స్ కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ తో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇక అందులో మహేష్ బాబు సాయి పల్లవి ఉండడం కూడా ఈసారి ఆశ్చర్యాన్ని కలిగించింది. 2002లో తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన కొన్ని వివాదాల వివరాల్లోకి వెళితే..

మహేష్ కామెంట్
సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా వరకు ఎలాంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. అయితే అలాంటి స్టార్ హీరో బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన ఒక కామెంట్ అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తనను భరించలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం వైరల్ అయిన విషయం తెలిసిందే. మేజర్ సినిమా ప్రమోషన్లో బాలీవుడ్ కు వెళ్లాలని అనుకోవడం లేదా అని అంటే టాలీవుడ్ లోనే తనకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది అని అందుకే ఇతర ఇండస్ట్రీలో కూడా వెళ్లాలని అనుకోవడం లేదని కూడా అన్నాడు. ఇక మహేష్ ఆ తరహా కామెంట్ చేయడంతో కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కూడా మహేష్ కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

సాయి పల్లవి కాంట్రవర్సీ
ఇక సాయి పల్లవి కూడా ఎవరు ఊహించిన విధంగా చేసిన మరొక కామెంట్ కూడా ఇండస్ట్రీలో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడిన ఆమె 90లో కాలంలో పండితులను ఏ విధంగా చంపారో ఆ సినిమాలో చూపించారు. కానీ ముస్లిం కు చెందిన ఒక డ్రైవర్ను కొట్టి జైశ్రీరామ్ అరవడం జరిగింది. అయితే రెండు ఘటనలతో తేడా ఏముంది అని ఆమె స్పందించిన విధానం ఒక్కసారిగా వివాదాలకు దారితీసింది. అనంతరం ఆ వివాదంపై అందరిని కూల్ చేసే విధంగానే ఆమె ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

లైగర్ గొడవ
ఇక
టాలీవుడ్
స్టార్
హీరో
విజయ్
దేవరకొండ
లైగర్
సినిమా
బాక్సాఫీస్
వద్ద
డిజాస్టర్
కావడమే
కాకుండా
ఆ
సినిమా
పెట్టుబడి
విషయంలో
అవకతవకలు
జరిగాయని
ఈడీ
చిత్ర
యూనిట్
సభ్యులను
అలాగే
హీరో
విజయ్
దేవరకొండను
కూడా
ప్రశ్నించిన
విషయం
తెలిసిందే.
అంతే
కాకుండా
ఆ
సినిమాకు
సంబంధించిన
పెట్టుబడి
విషయంలో
ED
అధికారులు
పూరి
జగన్నాథ్
ను
కూడా
కొంతసేపు
విచారించారు.
అనంతరం
సినిమా
నష్టాల
వలన
డిస్ట్రిబ్యూటర్స్
కూడా
ధర్నాకు
దిగాల్సి
వచ్చింది.

దిల్ రాజు వ్యాఖ్యలు
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును అందుకున్న దిల్ రాజు ఇప్పుడు ఇతర ఇండస్ట్రీలలో కూడా సినిమాలను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటీవల ఆయన వారిసు సినిమా కోసం మిగతా సినిమాలకు థియేటర్లకు దక్కకుండా చేస్తున్నారు అని ఆరోపణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా విజయ్ అజిత్ లను పోలుస్తూ విజయ్ కొంత పెద్ద స్టార్ హీరో అని అందుకే ఆయన కోసం ఎక్కువ థియేటర్స్ తమిళనాడులో అడుగుతున్నట్లు చేసిన కామెంట్ కూడా అక్కడ వైరల్ అయింది ఈ విధంగా కొంతమంది టాలీవుడ్ స్టార్స్ ఈ ఏడాది కాంట్రవర్సీ లలో నిలిచారు.