»   » బాలకృష్ణ పుట్టిన రోజుకై పోలీస్ బందోబస్తు

బాలకృష్ణ పుట్టిన రోజుకై పోలీస్ బందోబస్తు

Posted By:
Subscribe to Filmibeat Telugu

"నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పని చెయ్యాలి..అది తప్ప వేరే ఏదైనా పని చేస్తే నీకు నెక్ట్స్ బర్తడే ఉండదు" అంటూ వార్నింగ్ ఇచ్చిన సింహా (బాలయ్య) రేపు(జూన్ 9, గురువారం) 51వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో పార్లమెంట్ సభ్యుడు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు డైరక్షన్ లో పరమ వీర చక్ర చిత్రం ముహూర్తపు షాట్ ని చిత్రీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమలో చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు. బాలకృష్ణ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు యువత నేతలు బీద రవిచంద్ర యాదవ్, ఎంవీ సత్యనారాయణ రాజు, మద్ది పట్ల సూర్య ప్రకాష్..నేతృత్వంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్మాత సి.కళ్యాణ్ పోలీసులను కోరారు. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన ధరాకాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మూడు వేల మంది అభిమానులు వస్తారని ఆ ధరాకాస్తులో కళ్యాణ్ పేర్కొన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu