For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రేపే ప్రభాస్ 'రెబల్‌'కి గుమ్మిడికాయ

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'రెబల్‌'. తమన్నా, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ . రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రేపటి తో పూర్తి కానుంది. రేపు సాయింత్రం గుమ్మడికాయ కొట్టి షూటింగ్ ఫినిష్ చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్యాచ్ వర్క్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో దర్శకుడు లారెన్స్ చిత్రం గురించి మాట్లాడుతూ... రెబల్‌గా ముద్రపడ్డ ఓ యువకుడు ఎదురు తిరిగి నిలిస్తే ఎలా ఉంటుందనేదే మా రెబెల్ చిత్రం. అణిగిమణిగి ఉన్నంత కాలం పిల్లి కూడా మనకు ఎదురు తిరుగుతుంది. తిరుగుబావుటా ఎగరేస్తే పులి కూడా వెనక్కు పరుగెడుతుంది. మా హీరో నమ్మిన సిద్ధాంతం ఇదే. ఇంతకీ అతని పోరాటం ఎవరిపై? అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అన్నారు. చిత్రాన్ని సెప్టెంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు.

  అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి చెపుతూ.. లాభనష్టాల గురించి అతను ఆలోచించడు. కేవలం మంచి చెడులే ముఖ్యమంటాడు. గెలుపోటములపై అతనికి బెంగ లేదు. తిరుగుబాటు చేసి పోరులో నిలవడమే అవసరమంటాడు. అందుకే అతను రెబల్‌గా ముద్రవేయించుకున్నాడు. ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించాడు. ఇంతగా తిరగబడ్డ ఆ పోరు బిడ్డ ఎవరు? అతని అసలు లక్ష్యమేమిటి? తదితర విషయాలు మా సినిమాలో చెప్తున్నాం అన్నారు.

  అలాగే మా సినిమా లో హీరో కూర్చుని కబుర్లు చెప్పే రకం కాదు. రంగంలోకి దిగి చేసి చూపిస్తాడు. ఏటికి ఎదురీదడం అతనికిష్టం. పోరాడైనా గెలవడం అతని నైజం. ఇంతకీ అతని లక్ష్యం ఏంటి? అనేది మా చిత్రంలో చూడాల్సిందే అన్నారు. అలాగే ప్రభాస్‌ శైలికి సరిపోయే చిత్రమిది.'రెబల్' అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. 'రెబల్' అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా 'ఛత్రపతి'. ఆ సినిమాను మించే స్థాయిలో మా 'రెబల్' ఉంటుంది మాస్‌ని అలరించేలా ఫైట్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అందరికీ నచ్చుతుంది అన్నారు.

  తమన్నా, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. వారు మాట్లాడుతూ.. ప్రభాస్ కెరీర్‌లోనే 'రెబల్' హై బడ్జెట్ ఫిలిం అవుతుంది. మా బేనర్‌లోనే కాదు, ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అని చెప్పారు. కృష్ణంరాజు ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ముఖేష్ రుషి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, ప్రభ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: 'డార్లింగ్' స్వామి, కెమెరా: సి.రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కథ-స్క్రీన్‌ప్లే-కొరియోగ్రఫి, సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

  English summary
  The production team of Prabhas’s ‘Rebel’ will be breaking the gummadikaya tomorrow evening, and this will mark the end of the film’s shoot. Lawrence is the director of this movie and currently, patch work scenes are being shot in and around Hyderabad. The movie is gearing up for a release soon and the audio launch of the film will take place on September 14th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X