»   » ఉద్యమాల ఎఫెక్ట్ లేదు: ‘తుఫాన్’ బిజినెస్ అదిరింది

ఉద్యమాల ఎఫెక్ట్ లేదు: ‘తుఫాన్’ బిజినెస్ అదిరింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'తుఫాన్' చిత్రం సెప్టెంబర్ 6న విడుదలకు సిద్దం అవుతోంది. ఓ వైపు సమైక్యాంధ్ర ఉద్యమం, మరో వైపు తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో సినిమా పరిస్థితి ఏమిటో అని అంతా కలవర పడ్డారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లోనూ 'తుఫాన్' చిత్రం విడుదలకు ముందు మంచి బిజినెస్ చేసింది.

ఈ చిత్రం ఇప్పటికే నైజాంలో రూ. 11 కోట్లు అమ్ముడు పోయింది. ఏపీలోని అన్ని టెర్రిటరీల్లో కలిపి ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 34 కోట్లు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్దాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తుఫాన్ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఏరియా వైజ్‌గా క్రింది విధంగా ఉన్నాయి.

1. నైజా ఏరియా రూ. 11 కోట్లు
2. సీడెడె ఏరియా రూ. 7 కోటు(శాంత ఫిల్మ్స్)
3. నెల్లూరు ఏరియా రూ. 1.75 కోట్లు (క్రౌన్ మూవీస్)
4. కృష్ణ ఏరియా రూ. 2.40 కోట్లు (అలంకార్ ప్రసాద్)
5. గుంటూరు ఏరియా రూ. 3.10 కోట్లు (శాంత ఫిల్మ్స్)
6. వైజాగ్ ఏరియా రూ 3.75 కోట్లు (దిల్ రాజు)
7. ఈస్ట్ గోదావరి ఏరియా రూ. 2.60 కోట్లు (అనుశ్రీ ఫిల్మ్స్)
8. వెస్ట్ గోదావరి ఏరియా రూ. 2.40 కోట్లు (అనూష ఫిల్మ్స్)

రామ్‌చరణ్‌, ప్రియాంకచోప్రా జంటగా తెరకెక్కిన 'తుఫాన్‌' చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు అపూర్వ లకియా, విక్టరీ వెంకటేష్‌తో పాటు శ్రీహరి, దిల్‌రాజు, వి.వి.వినాయక్‌, తనికెళ్ల భరణి తదితరులు హజరయ్యారు.

రామ్ చరణ్ తేజ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రాన్ని తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రామ్ చరణ్‌తో జతకడుతోంది. రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలు, ప్రియాంకతో చేసే రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.

English summary
Mega power star Ram Charan's Toofan has done 34 crore pre release business. No Telangana and Seemandhra agitations effect on Mega Power Star Ram Charan’s ‘Toofan’. The Apoorva Lakhia directorial has done a shocking pre release business in all areas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu