For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  తుఫాన్: భద్రత కల్పిచాలని డీజీపికి హైకోర్టు ఆదేశం

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన బాలీవుడ్ మూవీ 'జంజీర్', తెలుగు వెర్షన్ 'తుఫాన్' సెప్టెంబర్ 6న విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో.....ఈ చిత్ర నిర్మాణ సంస్థ రియలన్స్ బిగ్ ఎంటర్టెన్మెంట్స్ రాష్ట హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా విడుదలయ్యేలా చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు ఆదేశించాలని కోర్టుకు విన్నవించడంతో స్పందించిన కోర్టు, ఈ మేరకు భద్రత కల్పించాలని గురువారం డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

  రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర మంత్రి చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్ నటించని సినిమాలను అడ్డుకుంటామని ఇప్పటికే పలువురు హెచ్చరికలు జారీ చేసారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రిలయన్స్ బిగ్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కోర్టు ఆశ్రయించింది.

  కాగా...తుఫాన్ మూవీ విడుదలను పురస్కరించుకుని తెలంగాణ ప్రాంతంలో పలు చోట్ల ఆ చిత్ర పోస్టర్లను ఉద్యమకారులు దగ్దం చేసారు. సామాజిక తెలంగాణ అంటూ ప్రజల వద్దకు వచ్చిన చిరంజీవి తర్వాత మాటమార్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ద్రోహిగా మారిన చిరంజీవి కుటుంబ సభ్యులు నటించే సినిమాలను అడ్డుకుంటామన్నారు. తుఫాన్ సినిమా తెలంగాణలో విడుదల కాకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని ఆందోలన కారులు డిమాండ్ చేశారు.

  మరో వైపు సీమాంధ్ర ప్రాంతంలోనూ ఈ చిత్రానికి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. చిరంజీవి తన మంత్రి పదవికి రాజీనామా చేయకుండా, సమైక్యాంధ్ర ఉద్యమానికి దూరంగా ఉంటున్న కారణంగా అతని కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకుంటామని ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమ కారులు సైతం హెచ్చరికలు జారీ చేసారు.

  సినిమా వివరాల్లోకి వెళితే...1975లో అమితాబ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'జంజీర్' చిత్రానికి రీమేక్‌గా అదే పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఏసిపీ విజయ్ ఖన్నా పాత్రలో నటించాడు. షేర్ ఖాన్ పాత్రలో హిందీలో సంజయ్ దత్, తెలుగులో శ్రీహరి పోషించగా, మోనా డార్లింగ్ పాత్రలో నటించింది. తనికెళ్ల భరణి, దేవ్ గిల్ కీలకమైన పాత్రలు పోషించారు.

  రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.

  English summary
  Reliance Big Entertainment Pvt. Ltd. moved the Andhra Pradesh High Court on Wednesday seeking directions to the state government and the police to take steps to ensure the smooth release and exhibition of the Ram Charan Teja and Priyanka Chopra-starrer Hindi film 'Zanjeer' and its Telugu version 'Thoofan;, scheduled to be released on September 6 throughout the state.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more