»   » రామ్ చరణ్ ‘తుఫాన్’ లేటెస్ట్ అప్ డేట్స్

రామ్ చరణ్ ‘తుఫాన్’ లేటెస్ట్ అప్ డేట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న భారీ చిత్రం జంజీర్. ఈ చిత్రాన్ని తెలుగులో తుఫాన్ పేరుతో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 6న ఈచిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒరిజినల్ హిందీ జంజీర్ చిత్రంతోనే అమితాబ్ బచ్చన్‌కు యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే. అమితాబ్ చలన చిత్ర జీవితంలోనే జంజీర్ ప్రత్యేక చిత్రం.

దానికి రీమేక్ గా తెరకెక్కిస్తున్న తుఫాన్ చిత్రం కూడా టాలీవుడ్‌లో రికార్డుల ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమౌతోంది. ఇటీవలే రామ్ చరణ్‌ను అమితాబ్ పొగడ్తలతో ముంచెత్తారు. 'రామ్ చరణ్ అద్భుతమైన నటుడు. ఈ చిత్రంలో తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడని నమ్ముతున్నా' అని ప్రశంసించారు.

ఈ ద్విబాషా చిత్రాన్ని సెప్టెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు మాట్లాడుతూ...'రామ్ చరణ్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. ముంబై నగరాన్ని గడగడలాడిస్తున్న ఆయిల్ మాఫియా ఆగడాలను అడ్డుకునే సమర్థవంతమైన పోలీసాఫీసర్ గా రామ్ చరణ్ నటన అద్భుతం.

ఈ సినిమా అతన్ని మరో లెవల్ కు తీసుకెళ్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రియాంక చోప్రా అందచందాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అపూర్వ లఖియా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చేలా తీర్చి దిద్దారు. మగధీర తర్వాత రామ్ చరణ్, శ్రీహరి మధ్య వచ్చే సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. తనికెళ్ల భరణి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. జంజీర్ చిత్రం 2013 సంవత్సరానికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం విశేషం' అన్నారు.

రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రాతో పాటు శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.

English summary
Ram Charan Teja’s prestigious Hindi debut film Zanjeer is being released in Telugu as Toofan. The shooting of the film was completed and has entered into post-production stage. Directed by Apoorva Lakhia, the film is remake of yesteryear’s super hit film of Amitabh Bachchan Zanjeer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu