»   » నమ్మక తప్పని నిజం: నంబర్ 1 స్థానం ఎన్టీఆర్ దే, 10 ప్లేస్ కి జారిన మెగాస్టార్

నమ్మక తప్పని నిజం: నంబర్ 1 స్థానం ఎన్టీఆర్ దే, 10 ప్లేస్ కి జారిన మెగాస్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"డాన్స్" మాస్ సినిమా కావచ్చు క్లాస్ సినిమా కావచ్చు ఇండియన్ సినిమా అంటే ఖచ్చితంగా మధ్యలో పాటలుండాల్సిందే.., డాన్సులుండాల్సిందే ఇక మన టాలీవుడ్ విషయం లో అయితే చెప్పాల్సిన పనే లేదు. ఖచ్చితంగా డాన్స్ అనేది మొదటి మూడు ముఖ్యమైన విష్యాల్లో ఒకటి

అయితీరుతుంది. అప్పటి నాగేశ్వ్ర రావు గారి దగ్గర నుంచీ ఈ నాటి అఖిల్ వరకూ అటు ఎన్టీఆర్ దగ్గర్నుంచీ ఇప్పుడే సినీ అరంగేట్రం కోసం డాన్స్ లో శిక్షణ తీసుకుంటున్న మోక్షఙ్ఞ వరకూ

డాన్స్ అంటే ఇండియన్ సినిమాలో ఒక భాగం అని చెప్పకనే చెబుతున్నారు. అయితే ఏఎన్నార్, ఎన్టీఆర్ ల తరం ముగిసాక డాన్సుల విషయం లో పిచ్చ క్రేజ్ తెచ్చుకున్నది మెగాస్టారే. అప్పట్లో బ్రేక్డాన్స్ అంటూ ఊపు ఊపేసినా, లుంగీ కట్టి మాస్ స్టెప్పులేసినా, అబ్బనీ తీయనీ దెబ్బా అంటూ క్లాస్ మూమెంట్స్ చేసినా చిరంజీవి డాన్స్ అంటే అదో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేఇ... అదే జోష్, అదే స్టైల్ ఇప్పుడు 150 సినిమాలో కూడా కనిపించింది.

top 10 best Indian dancer Tarak

అయితే తరం మారే కొద్దీ కొత్త కుర్రాళ్ళూ కొత్త స్టెప్పులూ వచ్చాయ్, కోరియో గ్రాఫర్లూ, డాన్సుల్లో కొత్తదనమూ వచ్చింది మరి ఈ త్రం లో అసలు డాన్స్ లో "తోపు" ఎవరూ అన్న విషయం మీద గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో 'ది టాప్ టెన్స్' అనే ఆన్‌లైన్ సంస్థ నిర్వహించిన డాన్స్ సర్వేలో జూనియర్ ఎన్టీఆర్‌కు టాప్ స్థానాన్ని కట్టబెట్టారు నెటిజన్లు.

భారత సినీ చరిత్రలో ద బెస్ట్ డాన్సర్ పేరిట చేసిన సర్వేలో 22 శాతం ఓట్లతో తారక్ టాప్ ప్లేస్‌ను సాధించాడు. ఈ జాబితాలో చిరంజీవికి పదో స్థానం దక్కింది. చిరంజీవికి వచ్చిన ఓట్లు కేవలం 2 శాతం. ఇక టాప్ 2లో 13 శాతం ఓట్లతో హృతిక్ రోషన్, 11 శాతం ఓట్లతో అల్లు అర్జున్ మూడో స్థానంలో ఉన్నాడు. అంతే శాతం ఓట్లతో ప్రభుదేవా నాలుగో స్థానం, 5 శాతం ఓట్లతో లారెన్స్ ఐదో స్థానంలో నిలిచాడు. కాగా, మాధురి దీక్షిత్ బెస్ట్ డాన్సర్లలో ఆరో స్థానాన్ని సాధించింది. ఐశ్వర్యరాయ్ 9 స్థానానికి పరిమితమైంది. ఇక, రామ్‌చరణ్ తేజ్ గురించి చెబితే.. కేవలం 17వ స్థానానికి పరిమతమయ్యాడు.

అతడికి వచ్చింది కేవలం ఒక శాతం ఓట్లు. అయితే.. ఈ సర్వేపై కొందరు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు చిరంజీవికి పదో స్థానం రావడంపై.. పెదవి విరుస్తున్నారు. సర్వే సరైనది కాదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ, జూనియర్ అభిమానులు మాత్రం.. తమ అభిమాన హీరోకు టాప్ స్థానం రావడంతో తెగ ఆనందపడిపోతున్నారు.

అయితే ఇక్కడో విషయం గమనించాలి ఇండియన్ టాప్ డాన్సర్ అనిపించుకున్న హృతిక్ రోషన్ కి కూడా 13% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ మరో విషయం కూడా గ్రహించాలి మెగాస్టార్ వయస్సు 60. అయినా 10 స్థానం లోనే నిలబడటం అంటే మాటలు కాదు. తారక్ ఈ తరం కుర్రాడు మొదటి స్థానం లో నిలబడటమూ మామూలే అందుకే అభిమానులు మరీ సీరియస్ గా ఆలోచించక పోవటమే మంచిది

English summary
Popular Search engine Google has out the list of Indian dancer. Among the Tollwyood biggies Young Tiger Jr.NTR is at top and he has beaten stylish star Allu Arjun and Megastar Chiranjeevi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu