»   » 2015లో టాలీవుడ్లో హయ్యెస్ట్ యూఎస్ కలెక్షన్ (లిస్ట్)

2015లో టాలీవుడ్లో హయ్యెస్ట్ యూఎస్ కలెక్షన్ (లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు వసూళ్ల పరంగా యూఎస్ఏ బాక్సాఫీసు ఎంతో కీలకమైనది. కొన్ని సినిమాల విషయంలో అయితే యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద వసూళ్ల ఆధారంగానే సినిమా హిట్టా? ఫట్టా? అనే విషయాలే తేల్చడంతో పాటు లాభ నష్టాలను బేరీజు వేస్తున్నారు.

2015లో తెలుగు పరిశ్రమ నుండి చాలా హిట్ సినిమాలు వచ్చాయి. బాహుబలి లాంటి భారీ హిట్ తో పాటు, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్, టెంపర్, గోపాల గెపాల, సన్నాఫ్ సత్యమూర్తి, కుమారి 21ఎప్, బలే భలేమగాడివోయ్ లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ఏలో కూడా మంచి వసూళ్లు సాధించాయి.

యూఎస్ఏలో కొందరు స్టార్ హీరోల సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. నాని లాంటి చిన్న స్టార్లు కూడా యూఎస్ఏలోని తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. యూఎస్ఏలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలకు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా ఆఫర్ చేస్తున్నారంటే అక్కడి మార్కెట్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఈ సంవత్సరం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి యూఎస్ఏ మార్కెట్లో భారీ వసూళ్లు సాధించింది. గతంలో కనీ వినీ ఎరుగని రీతిలో తెలుగు వెర్షన్ $6,460,124 (రూ 41.45కోట్లు) గ్రాస్ వసూలు చేసింది. బాహుబలి తమిళం $567,227 (రూ. 3.63 కోట్లు), హిందీ $481,469 (రూ 3.21 కోట్లు). మూడు భాషల్లో కలిపి $7,508,820 (రూ 48.29 కోట్లు) తర్వాతి స్థానంలో మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం ఉంది. ఈ చిత్రం $2,891,758 (రూ. 19.22 కోట్లు) గ్రాస్ వసూలు చేసింది.

స్లైడ్ షోలో యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద గ్రాస్ కలెక్షన్స్ పరంగా టాప్ 10 టాలీవుడ్ మూవీస్...

బాహుబలి

బాహుబలి

బాహుబలి మూవీ మూడు బాషలు కలిపి $7,508,820 (రూ.48.29 కోట్లు) వసూలు చేసింది

 శ్రీమంతుడు

శ్రీమంతుడు

మహేష్ బాబు శ్రీమంతుడు $ 2,891,758 (రూ. 19.22 కోట్లు) వసూలు చేసింది.

భలే భలే మగాడివోయ్

భలే భలే మగాడివోయ్

నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్' మూవీ $ 1,427,092 (రూ. 9.24 కోట్లు) వసూలు చేసింది.

సన్నాఫ్ సత్యమూర్తి

సన్నాఫ్ సత్యమూర్తి

అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి మూవీ $1,254,699(రూ.7.97) కోట్లు వసూలు చేసింది.

టెంపర్

టెంపర్

జూ ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీ $1,005,353 (రూ. 6.70 కోట్లు) వసూలు చేసింది.

రుద్రమదేవి

రుద్రమదేవి

గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రక చిత్రం రుద్రమదేవి $ 950,009 (రూ. 6.37 కోట్లు) వసూలు చేసింది.

గోపాల గోపాల

గోపాల గోపాల

వెంకటేష్, పవన్ కళ్యణ్ కాంబినేషన్లో వచ్చిన ‘గోపాల గోపాల' మూవీ $847,933 (రూ. 5.61 కోట్లు) వసూళ్లు చేసింది.

కంచె

కంచె

వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కించిన ‘కంచె' $528,199 (3.52 కోట్లు) వసూలు చేసింది.

కిక్ 2

కిక్ 2

కిక్ 2 మూవీ $ 307,195 (రూ. 2.04 కోట్లు) వసూలు చేసింది.

కుమారి 21 ఎఫ్

కుమారి 21 ఎఫ్

కుమారి 21 ఎఫ్ మూవీ $253,961(రూ. 1.70 కోట్లు) వసూలు చేసింది.

English summary
Telugu cinema witnessed many super hit films in this year, 2015. Movies such as Baahubali, Srimanthudu, Temper, Rudramadevi, Gopala Gopala, S/O Satyamurthy, Temper, Rudramadevi, Kumari 21F, Bhale Bhale Magadivoy etc. These movies not only ruled the domestic box office but, they also ruled the US box office.
Please Wait while comments are loading...