»   »  సర్వే : టాప్ 10 సెలబ్రిటీలు వీరే.. (ఫోటోలు)

సర్వే : టాప్ 10 సెలబ్రిటీలు వీరే.. (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : 2013 సంవత్సరం సగం గడిచిపోయింది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల విషయంలో సరికొత్త గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. టాప్ 10 సెలబ్రిటీల స్థానాలు మారాయి. సరికొత్త ముఖాలు తెరపైకి వచ్చాయి. స్మార్ట్ ఫోన్ల రాకతో ప్రస్తుతం ఎంటర్టెన్మెంట్ రంగం అరచేతిలో ఇమిడి పోయిన సంగతి తెలిసిందే.

ఇంటర్నెట్ అనుసంధానంతో తమ అభిమాన సెలబ్రిటీల వీడియోలు, పాటలు, ఫోటోలు, వారికి సంబంధించిన వివరాలు మొబైల్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ మొబైల్ వీడియో అండ్ మీడియా కంపెనీ ఓ సర్వే నిర్వహించింది. మొబైల్ ఫ్లాట్ ఫాంలో ఏ సెలబ్రిటీ గురించి ఎక్కువ సెర్చ్ చేసారు అనే గణాంకాలు సేకరించింది.

ఈ సర్వేలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నెం.1 స్థానంలో నిలిచాడు. మొబైల్ ఫోన్లలో అత్యధిక మంది సల్మాన్ వీడియోలు, ఫోటోలు, సమాచారం కోసం సెర్చ్ చేసారట. ఆ తర్వాతి స్థానంలో సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ కత్రినా కైఫ్ ఉంది. క్రికెట్ దేవుడుగా పేరొందిన సచిన్ టెండూల్కర్ మూడో స్థానం దక్కించుకున్నాడు. ఈ లిస్టులో బాలీవుడ్, టాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీలతో పాటు పలువరు హాలీవుడ్ తారలు కూడా ఉన్నారు.

మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

ఈ సర్వేలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నెం.1 స్థానాన్ని దక్కించుకున్నారు. కేవలం ఈ సర్వేలో మాత్రమే కాదు...యూఎస్‌కు చెందిన పీపుల్ మేగజైన్ బెస్ట్ లుకింగ్ మెన్లలో 7వ స్థానం, టైమ్స్ ఆఫ్ ఇండియా డిజైరబుల్ మెన్లలో మూడో స్థానం దక్కించుకున్నారు.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్

2010, 2011 సంవత్సరంలో ఆసియా సెక్సియెస్ట్ ఉమన్‍‌గా స్థానం దక్కించుకున్న బాలీవుడ్ హాట్ హీరోయిన్ కత్రినా కైఫ్....తాజాగా సర్వేలో రెండో స్థానం దక్కించుకుంది. మేకప్ ఉన్న లేకున్నా అందంలో ఆమెనే బెస్ట్ అంటున్నారంతా...

సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్

ఈ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదేమో. భారత్‌లో క్రికెట్ దేవుడిగా నీరాజనాలు అందుకుంటున్న సచిన్ తాజా సర్వేలో మూడో స్థానం దక్కించుకున్నారు.

రణబీర్ కపూర్

రణబీర్ కపూర్

బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ అంటే పడిచచ్చే అభిమానులు ఎందరో. ముఖ్యంగా అమ్మాయిల విషయం చెప్పక్కర్లేదు. బర్ఫీ, రాక్ స్టర్ చిత్రాలతో రణబీర్ తనదైన ముద్ర వేసారు. రణబీర్‌కు సర్వేలో 4వ స్థానం దక్కింది.

కిమ్ కర్దాషియాన్

కిమ్ కర్దాషియాన్

ఇప్పటి వరకు కిమ్ కర్దాషియాన్ అంటే కేవలం అమెరికాలో మాత్రమే ఫేమస్ అనుకున్నాం. అమెరికన్ టీవీనటి, మోడల్ అయిన కిమ్ కర్దాషియాన్‌కు భారత్ లోనూ భారీగానే అభిమానులు ఉన్నారని తాజా సర్వేలో తేలింది. ఆమెకు ఐదో స్థానం దక్కింది.

అనుష్క శర్మ

అనుష్క శర్మ

మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంటరైన అనుష్క శర్మ బ్యాండ్ బాజా భారత్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అందాన్ని ఆరాధించే వారు ఎందరో. అనుష్క శర్మకు ఈ సర్వేలో ఆరో స్థానం దక్కింది.

ప్రియమణి

ప్రియమణి

ఆసక్తికరంగా సౌతిండియా నుంచి హీరోయిన్ ప్రియమణి ఈ సర్వేలో 7వ స్థానం దక్కించుకుంది. ఇటీవల ఆమె షారుక్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో ఐటం సాంగు చేసింది. తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ బాషల్లో ప్రియమణి నటించింది.

టేలర్ స్విప్ట్

టేలర్ స్విప్ట్

అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ అయిన టేలర్ స్విప్ట్‌కు భారత్‌లో భారీగానే అభిమానులు ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. ఆమె ఆల్బమ్స్‌‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. సర్వేలో ఆమెకు 8వ స్థానం దక్కింది.

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్

సౌతిండియాలో పాపులర్ హీరోయిన్‌గా మారిన కాజల్ ఇటీవల రెండు మూడు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. తాజాగా నిర్వహించిన సర్వేలో కాజల్‌కు టాప్ 10లో 9వ స్థానం దక్కింది.

నిత్యా మీనన్

నిత్యా మీనన్

కేరళలో పుట్టి బెంగుళూరులో పెరిగిన నిత్యా మీనన్ సౌత్ సినిమాల్లో తనదైన మద్ర వేసింది. నిత్యా మీనన్ అంతం, అభినయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆమెకు ఈ సర్వేలో టాప్ 10లో స్థానం దక్కింది.

English summary
More than half a year has gone by and here we have a fresh list of the most searched celebrities on mobile platform in India. The top ten celebrities were revealed after a recent survey was conducted by an independent mobile video and media company. The list was topped by Bollywood superstar Salman Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu