»   » 2016 సినీ జ్ఞాపకాలు: టాలీవుడ్లో టాప్ 10 ఐటం సాంగ్స్ ఇవే...

2016 సినీ జ్ఞాపకాలు: టాలీవుడ్లో టాప్ 10 ఐటం సాంగ్స్ ఇవే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ సినిమాల్లో ఐటం సాంగులకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోల సినిమాలకు ఇదో కమర్షియల్ ఎలిమెంటుగా మారిపోయింది. గతంలో ఐటం సాంగులు చేసేందుకు ప్రత్యేకంగా కొందరు స్టార్స్ ఉండే వారు. అయితే రాను రాను స్టార్ హీరోయిన్లు సైతం స్పెషల్ సాంగుల పేరుతో ఐటం సాంగ్స్ చేస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కావడంతో నిర్మాతలు సైతం భారీగా ఖర్చు పెట్టి మరీ స్టార్ హీరోయిన్లను స్పెషల్ సాంగ్స్ చేయించేందుకు ఒప్పిస్తున్నారు.

2016 సంవత్సరంలో చాలా సినిమాల్లో స్పెషల్ సాంగులు వచ్చినా... బాగా పాపులర్ అయిన సాంగ్ మాత్రమ జూ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'జనతా గ్యారేజ్' చిత్రంలోని 'పక్కా లోకల్' సాంగ్. దేవిశ్రీ కంపోజ్ చేసిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. గీతా మాధురి పాడారు. ఈ పాటలో ఎన్టీఆర్ తో కలిసి సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ తన సెక్సీ ఒంపు సొంపులు ఆరబోస్తూ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసింది.


ఈ ఏడాది ఇంకా ఏయే సాంగ్స్ ప్రేక్షకుల ఆదరణ పొందాయి.... టాప్ 10లో స్థానం దక్కించుకున్న ఐటం సాంగ్స్ ఏవి... అనే అంశంపై ఓ లుక్కేద్దాం.


పక్కా లోకల్

జనతా గ్యారేజ్ చిత్రంలోని పక్కాలోకల్ సాంగ్... 2016 సంత్సరంలో మోస్ట్ పాపులర్ సాంగ్ గా నిలిచింది. ఈ సాంగును యూట్యూబులో అత్యధికంగా 80 లక్షలకుపై వ్యూస్ వచ్చాయి.


తోబా తోబా

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో తోబా తోబా సాంగ్ ఈ ఏడాది టాప్ 10 లిస్టులో 2వ స్థానం దక్కించుకుంది. ఈ సాంగులో హీరోయిన్ లక్ష్మీరాయ్ నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను అనంత శ్రీరామ్ రాసారు. ఎంఎం మానసి, నకాష్ అజీజ్ పాడారు. ఈ సాంగుకు యూట్యూబులో 53 లక్షల వ్యూస్ వచ్చాయి.


బ్లాక్ బస్టర్

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు చిత్రంలోని బ్లాక్ బస్టర్ సాంగ్ ఈ ఏడాది టాప్ 3 పొజిషన్ దక్కించుకుంది. తమన్ సంగీతం అందించిన ఈ సాంగును రామజోగయ్య శాస్త్రి రాసారు. ఇందులో హీరోయిన్ అంజలి నటించింది. యూట్యూబులో ఈ సాంగుకు 21 లక్షల వ్యూస్ వచ్చాయి.


ఐపిరి ఐటం సాంగ్

ఊపిరి చిత్రంలోని డోర్ నెం 1 ఐటం సాంగ్ టాప్ 4 పొజిషన్ దక్కించుకుంది. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. గీతా మాదురి పాడారు. నోరా పతేహి ఈ సాంగులో నటించింది. ఈ సాంగుకు యూట్యూబ్ లో 8 లక్షల వ్యూస్ వచ్చాయి.


టిక్కు టిక్కంటూ

బాబు బంగారం చిత్రంలోని టిక్కు టిక్కంటూ సాంగ్ టాప్ 5 జొజిషన్ దక్కించుకుంది. జెబి సంగీతం అందించిన ఈ సాంగును కాసర్ల శ్యాం రాసారు. జబర్దస్త్ యాక్టర్లతో సాంగ్ చిత్రీకరించారు.


దేశీ గర్ల్స్

శ్రీరస్తు శుభమస్తు చిత్రంలోని దేశీ గర్ల్స్ సాంగ్ టాప్ 6లో నిలిచింది. దీనికి తమన్ సంగీతం అందించగా...భాస్కర భట్ల సాహిత్యం అందించారు. హంసా నందిని హాట్ అండ్ సెక్సీ లుక్ లో ఆకట్టుకుంది.


టాక్సీ వాలా

సుప్రీమ్ చిత్రంలోని టాక్సీ వాలా సాంగ్ టాప్ 7 స్థానంలో నిలిచింది. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సాంగులో శృతి సోధి నటించింది.


టింగో టింగో

డిక్టేటర్ చిత్రంలోని టింగో టింగో సాంగ్ టాప్ 8వ స్థానంలో నిలిచింది. తమన్ సంగీతం అందించగా...... శ్రద్దా దాస్-ముమైత్ ఖాన్ తమ అందచందాలతో అలరించారు.


మందార తైలం

జాగ్వార్ చిత్రంలో హీరోయిన్ తమన్నాతో చేయించిన మందార తైలం సాంగ్ టాప్ 9వ స్థానం దక్కించుకుంది. ఈ పాటకు తమన్ సంగీతం అందించారు.


బ్యాచిలర్ బాబు

స్పీడున్నోడు చిత్రంలో తమన్నాతో చేయించిన స్పీడున్నోడు సాంగ్ టాప్ 10లో స్థానం దక్కించుకుంది.


English summary
Pakka Local from Jr NTR's Janatha Garage was the most loved and watched Telugu item song of 2016. Tauba Tauba from Sardaar Gabbar Singh, Blockbuster from Sarrainodu, and Door No 1 from Oopiri were the other hit numbers of the year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu