twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వంశి 'సితార' రీమేక్

    By Staff
    |

    Sitara
    భానుప్రియను పరిచయం చేస్తూ...తెలుగుతనం ఉట్టిపడే పాత్రలతో వంశీ రూపొందించిన సితార అప్పట్లో(1984) సూపర్ హిట్టై క్లాసిక్ గా నిలిచింది. అంతేగాక ప్రాంతీయ ఉత్తమ చిత్రం గా కేంద్ర ప్రభుత్వ అవార్డు ను అందుకుంది. అయితే ఇప్పుడా సినిమాని మళ్ళీ ఇంతకాలానికి వంశినే రీమేక్ చేయనున్నాడని సమాచారం. అయితే ఇప్పటి కాలానికి తగినట్లుగా చేర్పులు మార్పులు తో కథనం కొనసాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో 'వెన్నెల్లో గోదారి అందం' పాటకు గాను గాయని ఎస్ జానకి కి జాతీయ అవార్డు లభించింది. అలాగే అప్పటి ఇళయరాజానే ఈ చిత్రానికీ సంగీతం అందించటానికి అంగీకరించాడు.
    కథ విషయానికి వస్తే, ఫ్రీలాన్స్ photographer తిలక్ (శుభలేఖ సుధాకర్) రైలు లో ప్రయాణం చేస్తూ, టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నఓ అమ్మాయి (భానుప్రియ) కి సహాయం చేయడం కోసం టికెట్ కలెక్టర్ కి ఆమెని తన భార్య సితార గా పరిచయం చేస్తాడు. ఆమెకి ఎవరు లేరని తెలుసుకుని తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఆమె మోడలింగ్ అవకాశాలు ఇస్తాడు. తన గతాన్ని గురించి అడగరడనే కండిషన్ పై అతనితో కలిసి పని చేస్తుంటుంది సితార. ఆమెకు సినిమా అవకాశాలు రావడంతో తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారుతుంది. డబ్బు, కీర్తి ప్రతిష్టలు సంపాదించినా, తన గతాన్ని తల్చుకుని బాధపడే సితార కి ఆ బాధని తనతో పంచుకోమని సలహా ఇస్తాడు తిలక్.

    గోదావరి తీరంలోని ఓ పల్లెటూళ్ళో 'రాజుగారు' గా పిలవబడే చందర్ (శరత్ బాబు) చెల్లెలు కోకిల. పాడుబడ్డ భవంతిలో ఆ అన్నచెల్లెల్లు మాత్రమే ఉంటూ ఉంటారు. ఆస్తులు పోయినా, పరువు కి ప్రాణం ఇచ్చే చందర్, ఓ కోర్ట్ కేసు గెలవడం ద్వార ఆస్తులు తిరిగి సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. రాణివాసం లో ఉండే కోకిలకి బయటి ప్రపంచం తెలీదు. చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతం, నాట్యాలతో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. కోర్ట్ కేసు నిమిత్తం చందర్ ఓ పది రోజులు కోట విడిచి వెళ్తాడు. అదే సమయంలో ఊళ్లోకి వచ్చిన పగటి వేషగాళ్ళ నృత్యాలను కోటలోంచి రహస్యంగా చూస్తూ ఉంటుంది కోకిల. ఆ బృందం లో రాజు (సుమన్) ని ఇష్టపడుతుంది. రాజుతో ఆమె పరిచయం ఊరి జాతరకి రహస్యం గా అతనితో కలిసి వెళ్ళడం వరకు వస్తుంది. కోర్ట్ కేసు వోదిపోడం తో కోటకి తిరిగి వచ్చిన చందర్ కి కోకిల ప్రేమ కథ తెలియడంతో రాజుని చంపించి, తను ఆత్మహత్య చేసుకుంటాడు.

    తన పుట్టు పూర్వోత్తరాలు రహస్యంగా ఉంచమని కోకిలనుంచి మాట తీసుకుంటాడు చందర్. తిలక్ కి సితార తన గతాన్ని చెప్పడం విన్న తిలక్ స్నేహితుడైన ఓ జర్నలిస్టు (ఏడిద శ్రీరామ్) ఆమె కథని ఓ పుస్తకం గా ప్రచురిస్తాడు. తన గతం అందరికి తెలియడానికి తిలక్ కారణమని నమ్మిన సితార అతన్ని ద్వేషిస్తుంది. ఐతే ఆ పుస్తకం కారణంగా రాజు బ్రతికే ఉన్నదని తిలక్ కి తెలుస్తుంది. జర్నలిస్టు సహాయం తో ఆటను రాజు ని వెతికి, ఆత్మహత్య చేసుకోబోతున్న సితార తో కలిపి ఆమెని రక్షించడం తో సినిమా ముగుస్తుంది.

    ఇక ఈ చిత్రానికి నిర్మాత మల్లిడి సత్యనారాయణ(బన్నీ ఫేమ్) కుమారుడు మల్లిడి వెంకట్ ని హీరోగానూ,హీరోయిన్ గా కొత్త అమ్మాయిని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారు. గోపి,గోపిక,గోదావరి షూటింగ్ పూర్తవగానే వంశి ఈ ప్రాజెక్టుని చేపట్టే అవకాశం ఉంది.జనవరి 2009 లో ముహూర్తం చేస్తారని తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X