»   » బ్రహ్మనందం కెరీర్ ఇక ముగిసినట్టేనా: రెండేళ్ళుగా లైమ్ లైట్ వెనుకే బ్రహ్మీ

బ్రహ్మనందం కెరీర్ ఇక ముగిసినట్టేనా: రెండేళ్ళుగా లైమ్ లైట్ వెనుకే బ్రహ్మీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుస ఫ్లాప్ లు వచ్చినా, కొన్ని ఏళ్ళపాటే తెరకు దూరం గా ఉన్నా స్టార్ హీరోలకి పెద్ద గా ఎఫ్ఫెక్టేం ఉండదు. ఒక్క హిట్ చాలు మళ్ళీ పాత ఊపుని అందుకోవటానికి. అయితే అదే విశయం లో హీరోయిన్ లూ, కమెడియన్లూ రారు. ఏమాత్రం గ్యాప్ వచ్చినా...వరుసగా ఫెయిల్యూర్లు ఎదురైనా ఇక కెరీర్ గాడిలో పడటం కష్టమే...

అందులోనూ తమిళ తెలుగు ఇండస్ట్రీల్లో కమేడియన్ల మధ్య తీవ్ర పోటీ ఉన్న ఇలాంటి సమయం లో మరీ కష్టం. అయితే మన నవ్వుల రాజు బ్రహ్మానందం మాత్రం ఏకబిగిన 30 ఏళ్ళ పాటు సినీ ఇండస్ట్రీ లో కామెడీ రారాజుగా నిలబడ్డారు. కొన్ని సందర్భాల్లో సినిమాని కేవలం ఆయన కామెడీతోనే గట్టెక్కించారు బ్రహ్మీ... అయితే ఎవరికైనా ఒక దశలో కష్టాలు తప్పవు... అలాగే బ్రహ్మానందానికి కూడా కొన్ని సార్లు ఎదురు దెబ్బలు తగిలాయి.

2000 సంవత్సరం తర్వాత కొంచెం జోరు తగ్గినట్లు కనిపించినా. పూర్తిగా వెనకబడనైతే వెనకబడలేదు. త్రివిక్రమ్.. శ్రీను వైట్ల సినిమాల హోరు మొదలయ్యాక మళ్లీ జోరందుకున్నాడు బ్రహ్మి. ఒక దశలో హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించాడు మన కామెడీ మెగాస్టార్. ఒక సారి ఇక బ్రహ్మీ పని ఆఖరు ఈ యువకమేడియన్ల వల్ల వెనకబడ్డాడూ అనుకున్నాక కూడా కూడా మళ్ళీ కడుపుబ్బా నవ్విస్తూ పూర్వపు స్థికంటే ఎక్కువే ఎదిగిన ఆయనని చూసి ఇక బ్రహ్మానందానికి ఎదురు లేదు... ఆయన కెరీర్ పీక్స్ లోనే ఉంటుందీ అనుకున్నారంతా...

Tough time for Brahmanandam in tollywood

కానీ గత రెండేళ్లలో పరిస్థితి మారిపోయింది. వరుసగా ఆయన క్యారెక్టర్లన్నీ తుస్సుమంటూ వెళ్లాయి. క్రమంగా లైమ్ లైట్లోంచి వెళ్లిపోయాడాయన. ముందు చిన్నగా మొదలైన నెగెటివిటీ అంతకంతకూ పెరిగిపోయి.. బ్రహ్మిని ఇండస్ట్రీ అంతా దాదాపుగా పక్కనబెట్టేసింది. గతంలో ఏదైనా పెద్ద సినిమాలో బ్రహ్మి లేకుంటే ఆశ్చర్యపోయేవాళ్లు. కానీ ఇప్పుడు ఆయన ఉంటే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.

పోయిన రెండేళ్ళ లోనూ "సర్దార్ గబ్బర్ సింగ్".. "సరైనోడు" లాంటి స్టార్ సినిమాలో బ్రహ్మీ కేవలం "నామె కె వాస్తే" అన్నట్టు అయిపోయారు. సరిగా అలరించలేకపోయాడు. ఇక మహేష్ సినిమా "బ్రహ్మోత్సవం" లో అయితే ఆయని తీసుకోనే లేదు.

Tough time for Brahmanandam in tollywood

"అతడు" నుంచీ తన ప్రతి ప్రాజెక్ట్ లోనూ బ్రహ్మీ ని తప్పని సరిగా తీసుకునే త్రివిక్రమ్ కూదా. అఆ లో బ్రహ్మీ ని తీసుకోలేదు.. నిజానికి ఆయన ఉండిఉంటే ఈ సూపర్ హిట్ సినిమాకి మరింత అందం వచ్చి ఉండేది.

ఇక ప్రస్తుతం బ్రహ్మి గురించి ఇండస్ట్రీ లో కూదా ఎక్కడా పెద్దగా చర్చ జరుగుతున్నట్లు లేదు. వరుసగా వస్తూన్న కుర్ర కమేడియన్ల హవాలో బ్రహ్మానందం తేర మరుగులో ఉందిపోతున్నాడు. మరి ఇక నుంచైనా ఈ నవ్వుల రాజు తన పాత స్థాయికి చేరుకుంటాడో లేదో మరి....

English summary
Is it bad time running for comedian Brahmanandam? ... movies and became asset to many movies of Tollywood is now facing tough times.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu