For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కెరీర్ బెస్ట్ సినిమా అనిపించుకున్నా, రికవరీ అనుమానమే: ఆయనకి నిజంగా ఇది టఫ్ టైమ్

  |

  ఒకప్పుడు టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా రాజ శేఖర్ ఉండేవాడు. మొత్తంగా బ్లాక్ బస్టర్ లు లేకపోయినా నిర్మాతకి నష్టాలు మాత్రం ఉండేవి కావు. అయితే నెమ్మది నెమ్మదిగా మార్కెట్ లో రాజశేఖర్ చరిష్మా తగ్గుతూ వచ్చింది. ఒక్కడు చాలు లాంటి హిట్ తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా ఆ స్థాయి హిట్ లేదు రాజ శేఖర్ కి. తెలుగు సినిమాల బడ్జెట్లు ప్రధానంగా హీరోల మార్కెట్ ను బట్టే ఉంటాయి ఈ విషయం ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు...

   బిజినెస్ అంచనాల్ని బట్టే

  బిజినెస్ అంచనాల్ని బట్టే

  సినిమాలో ఎంత విషయం ఉన్నప్పటికీ హీరో మార్కెట్.. బిజినెస్ అంచనాల్ని బట్టే సినిమాకు ఖర్చు చేస్తుంటారు. ఐతే సీనియర్ హీరో రాజశేఖర్ కొత్త సినిమా ‘గరుడవేగ'కు మాత్రం ఇలాంటివేమీ చూసుకోలేదు. స్వయంగా రాజశేఖరే తనకు ఇప్పుడంత మార్కెట్ లేదని.. తన మార్కెట్ స్థాయిని మించి ఈ సినిమాకు చాలా ఖర్చు పెట్టేశారని అన్నాడు.

   10 కోట్లు పెట్టినా కష్టమే

  10 కోట్లు పెట్టినా కష్టమే

  వాస్తవంగా చెప్పాలంటే రాజశేఖర్ మీద ఇప్పుడు రూ.10 కోట్లు పెట్టినా కష్టమే అన్నట్లుంది. అలాంటిది ‘గరుడవేగ'కు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమా టీజర్.. ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్న మాట వాస్తవమే. కానీ ఎంత హైప్ ఉన్నా మరీ ఇప్పుడున్న టాప్ హీరోల సినిమాల స్థాయిలో మాత్రం ఆడే చాన్స్ తక్కువే.. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఆయన రిలీజ్ చేసే సీజన్ లో అంత పెద్ద హిట్ ఊహించలేం.

   విలన్ గా ట్రై చేస్తున్నాడు

  విలన్ గా ట్రై చేస్తున్నాడు

  ఒక దశలో ఇక సినిమాలు ఆపేస్తాడనీ, విలన్ గా ట్రై చేస్తున్నాడనీ వార్తలు వచ్చినా.. గుంటూర్ టాకీస్ దర్శకుడు ప్రవీన్ సత్తారు దర్శకత్వం లో పీఎస్వీ గరుడవేగ మొదలు పెట్టాడు. ఇందులో తనకు ఎప్పటినుంచో అచ్చివచ్చిన పోలీస్ పాత్రనే చేస్తున్నాడు. ఎలాగైనా హిట్టు కొట్టాలని కసిగా ఉన్న రాజశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టులో నటిస్తున్నాడు.

  బడ్జెట్ ఏకంగా రూ.25 కోట్లు

  బడ్జెట్ ఏకంగా రూ.25 కోట్లు

  ఇక్కడి వరకూ బాగానే ఉంది గానీ ఈ మధ్య నిర్మాత కోటేశ్వర రాజు వెల్లడించిన బడ్జెట్ వివరాలే కాస్త అనుమానాలు రేపుతున్నాయి. ఎందుకంటే ‘గరుడ వేగ' బడ్జెట్ ఏకంగా రూ.25 కోట్లని తాకిందట, ఈ విషయాన్ని నిర్మాత కోటేశ్వర రాజు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

  గరుడ వేగ

  గరుడ వేగ

  అయితే ‘గరుడ వేగ'కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కూడా పెట్టుబడి రికవర్ అవుతుందా అన్నది సందేహమే. హీరోగా రాజశేఖర్ మార్కెట్ చతికిలబడి దాదాపు పదేళ్ళు దగ్గర పడుతోంది.. పదేళ్ళలో యావరేజ్ దాటి ఆడిన సినిమా ఒక్కటి కూడా లేదు అన్నిటిలోకీ బెటర్ అనిపించుకున్నది "ఎవడైతే నాకేంటీ" మాత్రమే.

  అన్ సీజన్లో రిలీజ్

  అన్ సీజన్లో రిలీజ్

  ఆతర్వాత వచ్చినవన్నీ ఆల్మోస్ట్ డిజాస్టర్లే అయినా రాజశేఖర్ కి ఇంకా హీరో గానే కొనసాగాలన్న కోరిక పోలేదు. పైగా ఈ సినిమాను అన్ సీజన్లో రిలీజ్ చేస్తున్నారు. అందులోనూ దీంతో పాటుగా మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగలేదని సమాచారం.

   మూడు సినిమాలతో పోటీ

  మూడు సినిమాలతో పోటీ

  నిర్మాత చెప్పిన రేట్లకు కొనడానికి బయ్యర్లు ముందుకు రాకపోవడంతో కొంచెం తగ్గి అయిన కాడికి సినిమాను అమ్మేశారట. సినిమాను రిలీజ్ చేయడానికి వేరేగా ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చిందట. మూడు సినిమాలతో పోటీ పడుతుండటంతో థియేటర్ల సమస్య కూడా తలెత్తినట్లు సమాచారం.

   థియేటర్ల కోసం

  థియేటర్ల కోసం

  గతంలో రామానాయుడికి చికిత్స చేయడం ద్వారా దగ్గుబాటి కుటుంబానికి రాజశేఖర్ కొంత దగ్గరయ్యాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ‘గరుడవేగ'కు థియేటర్లు ఇచ్చే విషయంలో సురేష్ బాబు కొంత సాయం చేసినట్లు సమాచారం. తన కెరీర్ కు ‘గరుడవేగ' ఎంత కీలకమో చెప్పి థియేటర్ల కోసం రాజశేఖర్ ఇంకొందరు ప్రముఖులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

  English summary
  Tough Time For Rajasekhar Garuda Vega 'PSV Garuda Vega 126.18M', directed by Praveen Sattaru and starring the Angry Young Man Dr. Rajasekhar, is currently being shot is made a high cost of Rs.25 crores.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X