»   »  విష ప్రయోగం? కళాభవన్ మణి మరణం వెనక మరో కోణం!

విష ప్రయోగం? కళాభవన్ మణి మరణం వెనక మరో కోణం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి : ప్రముఖ సౌతిండియా నటుడు కళాభవన్ మణి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం వెనక రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. దీంతో ఆయనది సహజ మరణం కాదని తేల్చేసిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మణి దేహంలో విషపదార్థాలు ఉన్నట్లు టాక్సీకాలజీ రిపోర్టులో తేలింది. ప్రమాదకరమైన క్రిమిసంహారిని 'క్లోర్ ఫిరిఫోస్' అవశేషాలు ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారు. దీంతో పాటు మిథైల్, ఇథైల్ ఆల్కహాల్ కూడా ఉన్నట్లు తేలిందని జాయింట్ కెమికల్ ఎగ్జామినర్ కె.మురళీధరణ్ నాయర్ తెలిపారు. ఈ రిపోర్టు ఆధారంగా ఎవరైనా ఆయనపై విష ప్రయోగం చేసారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 Traces of pesticide in Kalabhavan Mani's body

పోస్టు మార్టం రిపోర్ట్ ప్రకారం..కళా భవన్ మణి తీవ్రమైన లివర్ సమస్యతో బాధపడ్డారు. ఆయన లివర్ పూర్తిగా డామేజ్ అయింది. లిక్కర్ తీసుకున్న తర్వాత లివర్ పంక్షన్ కు ఇబ్బంది ఎదురై రక్తం వాంతి చేసుకున్నారు. టాక్సీకాలజీ రిపోర్టు తర్వాత విషం ప్రయోగం జరిగినట్లు తేలడంతో అందరూ షాకయ్యారు.

ఆయన శరీరంలో విషయం ఎలా వెళ్లింది?.... ఇది అనుకోకుండా జరిగిందా? లేక ఎవరైనా కావాలని చేసారా? అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Deepening the mystery behind the death of Malayalam actor Kalabhavan Mani, the viscera report has stated that traces of pesticide and methanol were found in his internal organs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu