For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'గోపాల గోపాల' లో శ్రియ లుక్ ఇదే(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రం 'గోపాల గోపాల'. శ్రియ, మిథున్‌ చక్రవర్తి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కిషోర్‌ కుమార్‌ పార్థసాని దర్శకుడు. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరకర్త. ఈ చిత్రంలో శ్రియ లుక్ బయిటకు వచ్చింది. ఆమె ఇలా ...సంప్రదాయబద్దంగా కనిపించనుంది. చిత్రంలో ఆమె పాత్ర వెంకటేష్ కు భార్యగా, మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన ఆమెగా ఉండనుంది. ఈ చిత్రంపై ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది.

  https://www.facebook.com/TeluguFilmibeat

  ఈ సినిమా కోసం ప్రత్యేకమైన ఓ గీతాన్ని ఇటీవల హైదరాబాద్‌లో రికార్డ్‌ చేశారు. పాప్‌ గీతాలకు పెట్టింది పేరైన కైలాష్‌ ఖేర్‌ ఆలపించారు. తెలుగులో ఆయన గతంలో పండుగలా దిగి వచ్చాడు వంటి సూపర్ హిట్ సాంగ్ ని పాడిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది.

  నిర్మాత మాట్లాడుతూ...మన రోజువారీ జీవితం ఎలా గడిచిపోతోందో చెబుతూ ఆ గీతం సాగుతుంది. హృదయాల్ని మెలిపెట్టే పాటనీ, సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని చెబుతున్నారు. కైలాష్‌ ఖేర్‌ మాట్లాడుతూ ''గాయకులకు ఇలాంటి పాటలు అరుదుగా లభిస్తుంటాయి. విన్న ప్రతి ఒక్కరికీ సంతృప్తినిచ్చే గీతమిది'' అన్నారు. ''కైలాష్‌ ఖేర్‌ పాటని సొంతం చేసుకొని ఆలపించిన విధానం చాలా బాగుంది'' అని అనూప్‌రూబెన్స్‌ చెప్పారు.

  Traditional Shriya in Gopala Gopala

  బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్‌' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. శ్రియ హీరోయిన్. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌బాబు, శరత్‌మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘గోపాల గోపాల షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 2015 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం. డిసెంబర్‌లో పాటలను ఆవిష్కరిస్తాం'' అని తెలిపారు.

  శరత్‌ మరార్‌ మాట్లాడుతూ ‘‘వెంకటేశ్‌ పవన్‌కల్యాణ్‌ మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి సన్నివేశాలను రూపొందించాం. ఈ విషయంలో స్ర్కీన్‌ప్లేను సమకూర్చిన భూపతిరాజా, మాటల రచయిత సాయి మాధవ్‌ బుర్రా చాలా ప్రత్యేకమైన శ్రద్ధను కనబరిచారు'' అని చెప్పారు.

  ఇక గోపాల గోపాల సినిమాలో కేవలం మూడు పాటలే ఉన్నట్లు సమాచారం. తొలుత ఈ చిత్రంలో సాంగ్స్‌ లేకుండా చేద్దామనుకున్నా సినిమా ఫ్లో దెబ్బతినకుండా ఇలా మూడు పాటలు ప్లాన్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ టాక్‌. అయితే వీటిలో ఒక పాట మాత్రం వెంకటేష్‌, పవన్‌ల మధ్య సాగుతుందనే వార్తలు వచ్చాయి. మరో మూడు పాటలు చరణాలు మాత్రమే వినబడి బిట్స్‌ లాగా అనిపిస్తాయంట.

  మరీ వీటిలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే జనవరి (విడుదల) వరకు ఆగాల్సిందే. ఈ సినిమా షూటింగ్‌ వారణాసిలో చివరిదశ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించి ఆడియో కూడా ఎవరి ఊహకు అందనంతంగా విభిన్నంగా ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

  చిత్రం కథ విషయానికి వస్తే..

  దేవుడంటే నమ్మకం లేని ఓ వ్యక్తి దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది.

  బిజినెస్ విషయానికి వస్తే...

  పవన్‌కళ్యాణ్‌కు నైజాం ఏరియాలో ఉన్న క్రేజ్‌ అంతాఇంతాకాదు. అందుకే అక్కడ ఆయన సినిమాలు రికార్డులు బద్దలు కొడుతుంటాయి. 'గబ్బర్‌సింగ్‌' అక్కడ 17 కోట్లు వసూలు చేసిరికార్డు క్రియేట్‌ చేస్తే, తర్వాత వచ్చిన 'అత్తారింటికి దారేది దాదాపు 24 కోట్లు షేర్‌ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం 'గోపాల గోపాలకి ఆ ఏరియాలో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిందని విశ్వసనీయ సమాచారం.

  ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం...'గోపాల గోపాల నైజాం రైట్స్‌ 14 కోట్లకు అమ్ముడ య్యాయి.ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కేవలం థియేటర్స్‌ వరకు 55 కోట్లు చేసిందట. దీంతో నిర్మాత సురేష్‌బాబు, శరత్‌మరార్‌లు దాదాపు 20 కోట్ల వరకు టేబుల్‌ ప్రాఫిట్‌ లబ్దిపొందుతున్నారని టాక్‌. పవన్‌కళ్యాణ్‌ గత చిత్రం 'అత్తారింటికి దారేదికన్నా ప్రొడక్షన్‌ కాస్ట్‌ చాలా తక్కువ కావడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అంశమని అంటున్నారు.

  అలాగే...పవన్‌ కోసం ఓ బైక్‌ను అమెరికా నుంచి దిగుమతి చేశారని తెలిసింది. అన్ని పనులు పూర్తిచేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు.

  English summary
  Now Shriya is playing the role of Venkatesh's wife in Gopala Gopala,which is a remake of Bollywood hit Oh My God. Shriya Saran first look in Gopala Gopala has been revealed and she looks traditional in Saree.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X