»   » వేధిస్తే.. ఖబడ్దార్‌.!: సుదీప్‌

వేధిస్తే.. ఖబడ్దార్‌.!: సుదీప్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : ఈగ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన కన్నడ హీరో సుదీప్ రీసెంట్ గా .. పోలీసులు చేపట్టిన జాగృతికి ప్రచారకర్తగా ముందుకు వచ్చారు. ప్రత్యేక యాప్‌ విడుదలలో భాగంగా కబ్బన్‌ ఉద్యానం క్వీన్‌ విగ్రహం వద్ద బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇతర ప్రాంతాల నుంచి బెంగళూరుకు బస్సులు , రైళ్లలో వచ్చిన వారు మొదట ఆటోలవైపే చూస్తారని, గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆటోల్నే ఎక్కువ మంది ఎంచుకుంటారని గుర్తుచేశారు. ఆటోల్లో ప్రయాణం క్షేమమని, ప్రతి ఒక్కరూ గుర్తించేలా పోలీసులు చేపట్టిన జాగృతిని కొనియాడారు. నిబంధనల్ని పాటిస్తే పోలీసులు జరిమానాల్ని విధించరు. తక్కువ సంపాదన ఉంటుందనే భావన వదలిపెట్టాలని, చక్కని సేవల్ని అందిస్తే ఎక్కువ ఆదాయాన్ని గడించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం సుదీప్ ...మిర్చి రీమేక్ డైరక్ట్ చేస్తూ హీరోగా చేస్తున్నారు.


సిటీలో ఆటో డ్రైవర్ల వేధింపులు సర్వసాధారణంగా మారాయని పోలీసులకు పెద్దసంఖ్యలో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిపై చర్యల్ని తీసుకుంటున్నా ఆటోవాలాతో సమస్యల్ని ఏ మాత్రం తగ్గటం లేదు. తొలుత కాల్‌సెంటర్‌ నంబర్‌ను ప్రవేశపెట్టారు. దానికి స్పందన లేకపోవటంతో ఫేస్‌బుక్‌లో ప్రత్యేక ఖాతా తెరిచినా వేధింపులకు అడ్డుకట్ట పడలేకపోయింది. ఈనేపథ్యంలో బుధవారం నగర పోలీసులు ప్రత్యేక మొబైల్‌యాప్‌ను విడుదల చేశారు.

Traffic police app helps you rate auto drivers

హ్యాపీఆటో పేరిట విడుదల చేసిన యాప్‌ను గూగుల్‌ ప్లే నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని స్మార్ట్‌ఫోన్లలో ఉంచుకునేందుకు అవకాశం ఉంది. తప్పుడు మీటర్‌ ఉన్నా.. ఇష్టారాజ్యంగా నగదు డిమాండ్‌ చేసినా.. అసభ్యంగా ప్రవర్తించినా.. దురుసుగా వ్యవహరించినా.. మోసగించడానికి ప్రత్నించే ఆటోవాలాలపై తక్షణమే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ యాప్‌ను విస్తృతంగా వినియోగించుకునేలా జాగృతి కార్యక్రమాల్ని నిర్వహిస్తామని నగర పోలీసు కమిషనర్‌ రాఘవేంద్ర ఔరాద్కర్‌ తెలిపారు.

తమకు వచ్చే వాటిల్లో అత్యధికంగా ఆటోడ్రైవర్లు దురుసుగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు ఉంటున్నాయని అదనపు పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) బి.దయానంద్‌ తెలిపారు. ఆటోల్లో ప్రయాణం క్షేమకరం కాదని ఎవరూ భావించకూడదన్నారు. ఆయా ఆటోడ్రైవర్ల సంఘాలు ఇప్పటికే తమ కార్యక్రమానికి సంఘీభావం తెలిపాయన్నారు. చక్కని సేవల్ని అందించే ఆటోలకు సుగమ సవారి అనే స్టిక్కర్లు అంటించి ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈసందర్భంగా ప్రయాణికులు ఆటోలో మరిపోయిన వస్తువుల్ని తిరిగి వారికి చేర్చేందుకు సహకరించిన ఐదుగురు డ్రైవర్లకు కమిషనర్‌ ప్రశంసాపత్రాల్ని అందించారు. కార్యక్రమంలో పోలీసుఅధికార్లు గిరీష్‌, ప్రసాద్‌, రవాణాశాఖ కమిషనర్‌ అమర్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

English summary
Kannada film actor Sudeep formally launched Traffic police app application. Addressing auto drivers in the audience, he said: “Drivers play an important role in building the image of the city. They are the first local residents that a visitor encounters. Their behaviour will give the city a good name. Drivers should treat visitors well, not demand excess fare, and most importantly, not refuse to ply to any destination.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu