»   » అల్లు అర్జున్ ని చూసేందుకు వెళ్లి కరెంట్ షాక్..

అల్లు అర్జున్ ని చూసేందుకు వెళ్లి కరెంట్ షాక్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజామాబాద్ :నిజామాబాద్‌లో బుధవారం జోయాలుక్కాస్ నగల షోరూమ్‌ను సినీ హీరో అల్లు అర్జున్ ప్రారంభించారు. బన్నీని చూడటానికి వందలాది మంది అభిమానులు తరలివచ్చారు. తమ అభిమాన హీరోని చూసేందుకు భారీగా జనం ఎగబడ్డారు. దాంతో షోరూం ప్రారంభించే సమయంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దాంతో 19 సంవత్సరాల జునేద్ విద్యుల్ షాక్ తగిలి అక్కడికక్కడే కూలిపోయారు. వెంటనే అతన్ని జిల్లా కేంద్ర గవర్నమెంట్ హాస్పటిల్ కి తీసుకు వెళ్లారు.

వివరాల్లోకి వెళితే... అల్లు అర్జున్ రాక నేపథ్యంలో బందోబస్తు నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. రోడ్డుపై విపరీతమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి నుంచి వచ్చిన అల్లు అర్జున్ అభిమాని ఎండీ కాసీఫ్ జునైద్ విద్యుదాఘాతానికి గురై ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. తన అభిమాన హీరోను చూసేందుకు పక్కనున్న ట్రాన్స్‌ఫార్మర్ కంచెపైకి ఎక్కిన కాసీఫ్ ప్రమాదానికి గురయ్యాడు.

మొదటిగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ చేరుకున్న అల్లు ఉదయం కొద్దిసేపు వంశీ ఇంటర్నేషనల్ హోటల్‌లో ఫ్రెషప్ అయ్యారు. అనంతరం రోడ్డు కిరువైపులా కిక్కిరిసిన అభిమానులకు అభివాదం చేస్తూ షోరూంకు వెళ్లి ప్రారంభించారు. షోరూంలో జ్యోతి ప్రజ్వల న చేశారు. కొత్త మోడల్ ఆభరణాలను తిలకించారు. హైదరాబాద్‌రోడ్డులో ఇప్పటి కే బ్రాండెడ్ కంపెనీ వస్త్రాలయాలు, మూడు నక్షత్రాల హోటళ్లు, కళానికేతన్, ఆకృ తి, తదితర ప్రముఖ వ్యాపార షోరూంలు వెలిశాయి. జోయాలుక్కాస్ జ్యువె లర్ షోరూంతో ఈ రోడ్డును కొత్తశోభను సంతరించుకుంది.

అల్లు అర్జున్ మా ట్లాడుతూ ఇటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు ప్రాతినిథ్యం వహించటం ఎంతో సంతోషం గా ఉందన్నారు.2nzb30a నగల వ్యాపారంలో నమ్మకం, విశ్వాసంతో జోయాలుక్కాస్ ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ ప్రజల విశ్వాసాన్ని చూరగొందన్నారు. జోయాలుక్కాస్‌లో ఉత్తమమైన ఆభరణాలను పొందవచ్చన్నారు. ప్రారంభోత్సవానికి ఇందూరుకు రావటం ఆనందంగా ఉందన్నారు.

English summary
Tragedy struck in a program attended by Allu Arjun in Nizamabad. Md.Khasif Junaid (19) travelled 200 Kms to get a glimpse of his hero Allu Arjun. But he suffered electric shock and is now battling for life. Allu Arjun came to Nizamabad to open a jewellery shop. Khasif came from Mandamarri and the moment Allu Arjun came everyone pushed forward. Khasif climbed a transformer to see Allu Arjun but some unknown people pushing him from back he fell on the electric wires got shock. He suffered severe injuries on stomach, heart and back. Police shifted him to Govt. hospital and informed his family members. He was later bought to Gandhi hospital as his condition turned serious.
Please Wait while comments are loading...