»   » సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్లో విషాదం..

సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్లో విషాదం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మనవడు సాకేత్ రామ్ వెల్లంకి (19) అమెరికాలో మృతి చెందారు. దీంతో తమ్మారెడ్డి ఇంట విషాదం నెలకొంది. తమ్మారెడ్డి కుమార్తె కుమారుడైన సాకేత్ మృతికి ఇంకా కారణాలు తెలియరాలేదు. మృతదేహానికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. దాంతో అతని అంత్యక్రియలు బుధవారం అమెరికాలోని వర్జీనియాలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగువారు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

Tragedy in Tammareddy family

సాకేత్ మరణవార్త విని ఆయన కుటుంబీకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సినీ లోకం షాక్‌కు గురైంది. సినీ ప్రముఖులంతా సాకేత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సాకేత్ అతి పిన్న వయస్సులోనే తిరిగి రాని లోకాలు చేరిపోవడంపై సన్నిహితులు, కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

English summary
Director Tammareddy Bhardwaja's daughter son Saketh Vellanki died in US. His funerals are conducting in Varginia of US. Details are not known behind his death.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu