»   »  డిసప్పాయింట్ అయ్యేలా ‘రుద్రమ దేవి’ ట్రైలర్‌టాక్

డిసప్పాయింట్ అయ్యేలా ‘రుద్రమ దేవి’ ట్రైలర్‌టాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్ చేస్తున్న ‘రుద్రమదేవి' దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. సోమవారం సాయంత్రం ట్రైలర్ విడుదల కాగా....మంగళవారం మధ్యాహ్నానికి ట్రైలర్ వీక్షించిన వారి సంఖ్య 5 లక్షలకు చేరువైంది. దీన్ని బట్టి సినిమా కోసం జనాలు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ట్రైలర్ చూసిన వారు రుద్రమదేవి పాత్రధారి అనుష్క, గోనగన్నారెడ్డి పాత్రదారి అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్‌పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసారు. అదే విధంగా రానా పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే ట్రైలర్లో చూపించిన గ్రాఫిక్స్ మాత్రం సంతృప్తికర స్థాయిలో లేదని అంటున్నారు.

Trailer Review: Anushka-Allu Arjun's Rudhramadevi Trailer Disappoints!

ముఖ్యంగా సినిమా కలర్ థీమ్ కూడా రియాల్టీగా లేదనే వాదన వినిపిస్తోంది. ఏదో సెట్టింగులు వేసి స్టేజీ డ్రామా తెరకెక్కించినట్లు ఉందే తప్ప రియాల్టీ ఉట్టి పడటం లేదని అంటున్నారు. ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినిమాలన్నీ ప్రాంతీయ భాషల్లో అనువాదం అవుతూ సాధారణ జనానికి కూడా చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాలు చూసిన వారికి ఈ చిత్రంలో వాడిన గ్రాఫిక్స్‌, కలర్ థీమ్ అంతగా ఇష్టపడం లేదు.

అయితే ట్రైలర్ చూసి...పూర్తి సినిమాను అంచనా వేయడం అసాధ్యం. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక ప్రెస్టీజియస్ మూవీ. దర్శక నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్స్ తమ శక్తిమేర కష్టడి తెరకెక్కించిన చిత్రం. సినిమా పూర్తి స్థాయిలో వినోదం పంచే విధంగా ఉంటుందని భావిస్తున్నారు.

Trailer Review: Anushka-Allu Arjun's Rudhramadevi Trailer Disappoints!

రుద్రమదేవి చిత్రాన్ని గుణశేఖర్ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రియల్ 24న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. తెలుగు, తమిళ, మళయాల వెర్షన్ లు సైతం ఇదే రోజున విడుదల చేస్తారు.

ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
The Magnus opus, Rudhramadevi was shot for more than 2 years and the team has finally released it's trailer to the audience, who have been waiting to get a glimpse of the visual wonder. But to their disappointment, Rudhramadevi trailer lacks that magic.
Please Wait while comments are loading...