‘ట్రాప్డ్’.... హీరో పరిస్థితి చూసారా పాపం! (ట్రైలర్)

విక్రమాదిత్య మొత్వాని తాజాగా ‘ట్రాప్డ్’ పేరుతో ఓ సినిమా తీస్తున్నారు.

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్లో త్వరలో సరికొత్త కాన్సెప్టుతో ఓ సినిమా రాబోతోంది. దర్శకుడికి వచ్చిన ఆలోచన చూస్తే అసలు ఇలాంటి కాన్సెప్టును కూడా సినిమాగా తీయొచ్చా అని ఆశ్చర్యపోతారు. ఆ దర్శకుడు మరెవరో కాదు... గతంలో బాలీవుడ్లో ఉదాన్, లుటేరా వంటి చిత్రాలను తెరకెక్కించిన విక్రమాదిత్య మొత్వాని.

TRAPPED movie Official Trailer released

తాజాగా ఆయన 'ట్రాప్డ్' పేరుతో ఓ సినిమా తీస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ రాజ్ కుమార్ రావ్ హీరోగా నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా రిలీజైంది. ముంబైలో ఓ అపార్ట్ మెంటులో టాప్ ఫ్లోర్లో ఉండే హీరో గర్ల్ ఫ్రెండ్ నుండి ఫోన్ రావడంతో హడావుడిగా బయల్దేరుతారు.

ఈ క్రమంలో డోర్ లాక్ అయి అనుకోకుండా రూమ్ లో ఇరుక్కుపోతాడు. కోపంలో ఫోన్ కూడా విసిరేయడంతో బయట ఎవరినీ కాంటాక్ట్ చేయలేక, బయటకు వచ్చే దారి లేక అందులోనే ఇరుక్కుంటాడు. ఈ క్రమంలో హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అందులో నుండి బయట పడటానికి హీరో ఏం చేసాడు? అనేది సినిమా. కేవలం 20 రోజుల్లోనే ఈ సినిమా పూర్తి చేసారట.

ఓ చిన్న పాయింటును బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే చాలా కీలకం. దర్శకుడు స్క్రీన్ ప్లే మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. మార్చి 17న ఈ సినిమా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X