For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్:బికినీలో పూజా హెగ్డే రచ్చ..ప్యాంట్‌ వేసుకోకుండా ఉర్ఫీ జావేద్..మూడో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీర

  |

  దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉత్తేజం కనిపిస్తున్నది. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న బిగ్‌బాస్, అఖండ, శ్యామ్ సింగరాయ్, పుష్ప చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. వారం రోజులుగా మీడియాలో వైరల్‌గా అవుతున్న కథనాలు మీకోసం...

  Tamannaah Bhatia స్పోర్ట్స్ బ్రాలో మిల్కి బ్యూటీ మాస్ స్టెప్పులు.. వరుణ్ సందేశ్‌కు, మరో హీరోయిన్‌కు సవాల్

  Tamannaah Bhatia స్పోర్ట్స్ బ్రాలో మిల్కి బ్యూటీ మాస్ స్టెప్పులు.. వరుణ్ సందేశ్‌కు, మరో హీరోయిన్‌కు సవాల్


  దేశ సినీ పరిశ్రమలో సుమారు రెండు దశాబ్దాల కెరీర్‌తో మూడు పదుల వయసులో కూడా భారీ ఆఫర్లతో తమన్నా భాటియా జోరు కొనసాగిస్తున్నది. సినీ రంగంలోకి వస్తున్న కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఎప్పటికప్పుడు సినీ పరిశ్రమలో వస్తున్న మార్పులను అవలోకనం చేసుకొంటూ తనను మార్చుకొంటూ ముందుకెళ్తున్న మిల్కి బ్యూటీ తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో వివరాల్లొ వెళితే..

   మళ్లీ బికినీలో రచ్చ చేసిన పూజా హెగ్డే: ఈ సారి తడిచిన అందాలతో అంతకు మించి!

  మళ్లీ బికినీలో రచ్చ చేసిన పూజా హెగ్డే: ఈ సారి తడిచిన అందాలతో అంతకు మించి!

  పూజా హెగ్డే.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ చాలా కాలంగా టాలీవుడ్‌లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగులో మాత్రమే కాదు.. మిగిలిన భాషల్లోనూ ఈ అమ్మడు ఫుల్ బిజీ అయిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతేకాదు, అందులో అందాల విందు చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా పూజా హెగ్డే బికినీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై మీరూ లుక్కేయండి!

  కూతురి కోసం చిన్నపిల్లాడిలా మారిపోయిన అల్లు అర్జున్.. ఇంతకంటే క్యూట్ మూమెంట్ మరొకటి ఉండదు!

  కూతురి కోసం చిన్నపిల్లాడిలా మారిపోయిన అల్లు అర్జున్.. ఇంతకంటే క్యూట్ మూమెంట్ మరొకటి ఉండదు!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడు. పుష్ప సినిమా దాదాపు అన్ని భాషల్లోనూ మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో అల్లు అర్జున్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు తన కుటుంబ సభ్యులతో బన్నీ ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తున్నాడు. ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో గడిపేందుకు బన్నీ ఎక్కువ ఆసక్తిని చూపిస్తాడు. ఇక ఇటీవల తన కూతురుతో అందుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  Pawan Kalyan పై వర్మ సంచలన కామెంట్స్: ఆ సినిమా ఫ్లాప్ అంటూ.. తారక్, బన్నీ, చరణ్‌లపై కూడా!

  Pawan Kalyan పై వర్మ సంచలన కామెంట్స్: ఆ సినిమా ఫ్లాప్ అంటూ.. తారక్, బన్నీ, చరణ్‌లపై కూడా!

  తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి దర్శకుడిగా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. తనదైన చిత్రాలతో అప్పటి వరకూ టాలీవుడ్‌లో ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ ఎన్నో జోనర్లలో గొప్ప గొప్ప సినిమాలను తెరకెక్కించాడు. ఈ క్రమంలోనే తాజాగా వర్మ.. పవన్‌ కల్యాణ్‌పై సంచలన ట్వీట్స్ చేశాడు. అలాగే, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లను కూడా లాగాడు. ఆ సంగతులు మీకోసం!

  RRR కోసం వెనుకడుగు వేసిన ఆచార్య.. భీమ్లా నాయక్ కోసం రెండు డేట్లు.. F3 న్యూ డేట్ ఫిక్స్!

  RRR కోసం వెనుకడుగు వేసిన ఆచార్య.. భీమ్లా నాయక్ కోసం రెండు డేట్లు.. F3 న్యూ డేట్ ఫిక్స్!

  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరోసారి విడుదల తేదీల పై అందరూ ఒక నిర్ణయానికి వచ్చి సామరస్యంగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకుండా సరికొత్త విడుదల తేదీలను ఫిక్స్ చేసుకున్నారు. ఆచార్య సినిమా RRR సినిమా కోసం ఒక తేదీని త్యాగం చేయగా భీమ్లా నాయక్ సినిమా మాత్రం పరిస్థితి ఎప్పుడు బాగుంటే అప్పుడు వచ్చేస్తాను అని క్లారిటీ ఇచ్చేశాడు. F 3 సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది.

  Priyamani ఏదైనా సమస్య ఉంటే.. అది నాకు, నా భర్తకు మధ్యే.. మరొకరికి సమాధానం చెప్పాలా? ఘాటుగా ప్రియమణి

  Priyamani ఏదైనా సమస్య ఉంటే.. అది నాకు, నా భర్తకు మధ్యే.. మరొకరికి సమాధానం చెప్పాలా? ఘాటుగా ప్రియమణి

  దక్షిణాదిలోనే కాకుండా హిందీలో రాణిస్తున్న సీనియర్ హీరోయిన్ ప్రియమణి విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో ఆలరిస్తున్నది. ఇటీవల ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్, నారప్ప చిత్రాలతో నటిగా మరోసారి రుజువు చేసుకొన్నారు. తాజాగా మరోసారి భామా కలాపం అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి డియర్ కామ్రేడ్ ఫేమ్ భరత్ కమ్మ సమర్పించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ఈ సినిమా 11వ తేదీన రిలీజ్ సిద్దమవుతున్న నేపథ్యంలో ప్రియమణి జాతీయ మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ విషయాలను పంచుకొన్నారు. ఈ నేపథ్యంలో ప్రియమణి ఏం చెప్పారంటే..

  Ariayana Glory ప్రైవేట్ పార్టుపై అషు రెడ్డి ముద్దులు.. బిగ్ బాస్ భామల రచ్చ మాములుగా లేదుగా!

  Ariayana Glory ప్రైవేట్ పార్టుపై అషు రెడ్డి ముద్దులు.. బిగ్ బాస్ భామల రచ్చ మాములుగా లేదుగా!

  బిగ్‌బాస్‌ రియాలిటీ షో ప్రేక్షకులకు ఏ రేంజ్‌లో వినోదాన్ని అందిస్తుందో షో పాల్గొన్న సభ్యులకు కూడా మంచి పాపులారిటీ తెచ్చిపెడుతోంది. ఈ షోకు వచ్చే కంటే ముందు కొన్ని వర్గాల వారికి తెలిసిన వాళ్లు హౌజ్‌ నుంచి అడుగు బయటపెట్టగానే ఎక్కడ లేని క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. వరుస ఆఫర్లతో దూసుకుపోతూ ఒకపక్క పాపులారిటీతో మరోపక్క నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. అయితే తాజాగా అరియనా బొడ్డు మీద అషు రెడ్డి ముద్దు పెట్టిన ఫోటో సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  ప్యాంట్‌ వేసుకోకుండా రోడ్డెక్కిన ఉర్ఫీ జావేద్.. ఫొటోగ్రాఫర్లు వెంటపడడంతో.. చేతులు అడ్డుపెట్టుకుని పరుగు!

  ప్యాంట్‌ వేసుకోకుండా రోడ్డెక్కిన ఉర్ఫీ జావేద్.. ఫొటోగ్రాఫర్లు వెంటపడడంతో.. చేతులు అడ్డుపెట్టుకుని పరుగు!

  హిందీలో జ‌రిగిన ఓటీటీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న అమ్మడు ఉర్ఫీ జావెద్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉర్ఫీ త‌న హాట్ ఫొటోలు, వీడియోల‌తో మంటలు రేపేస్తోంది. ముఖ్యంగా డిఫ‌రెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్‌తో అందాల‌ను చూపీ చూపించ‌కుండా టీజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఉర్ఫీ జావెద్ ఇప్పుడు అనుకోని విధంగా వార్తల్లో నిలిచింది. ఫోటోగ్రాఫర్లు ఎప్పుడు కనపడినా ఆమె నిలబడి మరీ ఫోజులు ఇచ్చేది అలాంటిది ఆమె పెడుతూ వీడియోకి చిక్కింది. ఆ వివరాల్లోకి వెళితే..

  సుడిగాలి సుధీర్ రికార్డు బ్రేక్ చేసిన హైపర్ ఆది: ఇద్దరి మధ్య ఏకంగా 30 లక్షలు తేడా!

  సుడిగాలి సుధీర్ రికార్డు బ్రేక్ చేసిన హైపర్ ఆది: ఇద్దరి మధ్య ఏకంగా 30 లక్షలు తేడా!

  కొంత కాలంగా తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును అందుకుంటున్నారు. తద్వారా భారీ పాపులారిటీని, వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది ఒకడు. పంచ్‌ల స్పెషలిస్టుగా పేరొందిన అతడు.. సుదీర్ఘ కాలంగా అసాధారణమైన టాలెంట్‌తో అదరగొడుతూ అంచలంచెలుగా ఎదుగుతోన్నాడు. ఈ క్రమంలోనే ప్రతివారం తనదైన శైలిలో స్క్రిప్టులు రాసుకుంటూ స్కిట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు హైపర్ ఆది.. సుడిగాలి సుధీర్ రికార్డును బద్దలు కొట్టేశాడు. అసలేం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

  అనసూయ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్.. ఖిలాడీలో మరో ఊహించని రోల్ ?

  అనసూయ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్.. ఖిలాడీలో మరో ఊహించని రోల్ ?

  టెలివిజన్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ అనుకోని రీతిలో ఇప్పుడు నటిగా బిజీ అయింది. ఆమెను దృష్టిలో పెట్టుకుని కొంతమంది సినిమాలు రాసుకుంటుంటే మరికొంత మంది దర్శకులు మంచి పాత్రలు కూడా డిజైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పుష్ప సినిమాతో హిట్ అందుకున్న ఆమె మరో సినిమాలో భాగమైంది. అయితే ఆమె పాత్ర గురించి ఇప్పుడు ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

   సాయి పల్లవిపై బాడీ షేమింగ్.. నన్ను తీవ్రంగా బాధిస్తుంది, నేను కూడా బాధితురాలినేనన్న గవర్నర్ తమిళిసై

  సాయి పల్లవిపై బాడీ షేమింగ్.. నన్ను తీవ్రంగా బాధిస్తుంది, నేను కూడా బాధితురాలినేనన్న గవర్నర్ తమిళిసై

  సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలకు సామాన్యులకు మధ్య దూరం చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు తన అభిమాన నటీనటులతో మాట్లాడాలి అంటే ఒక రకంగా యజ్ఞాలు చేసే వాళ్ళు వారి వారి అభిమానులు. కానీ ఇప్పుడు చాలా ఈజీగా సోషల్ మీడియాలో ఆయన అభిమాన హీరో హీరోయిన్ల అకౌంట్ లోకి వెళ్లి నేరుగా వారి గురించి కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే తమ అభిమానాన్ని చాటుకుంటే పర్వాలేదు కానీ బాడీ షేమింగ్ కు పాల్పడిన విషయాలు మాత్రం హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. ఇప్పుడు సాయి పల్లవి విషయంలో అదే జరిగింది. సాయి పల్లవి బాడీ షేమింగ్ బారిన పడగా ఆ విషయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే...

   మూడో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో.. ఆ కుర్ర హీరోయిన్‌తో హీరోయిన్ అఫైర్ కారణంగానే..

  మూడో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో.. ఆ కుర్ర హీరోయిన్‌తో హీరోయిన్ అఫైర్ కారణంగానే..

  ఇతర ఇండస్ట్రీలతో పోల్చుకొంటే హిందీ చిత్ర పరిశ్రమలో అఫైర్లు, డేటింగ్స్, బ్రేకప్స్ సర్వసాధారణంగా కనిపిస్తాయి. హీరో, హీరోయిన్ల మధ్య సంబంధాలు ఎప్పుడూ మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తూనే ఉంటాయి. అయితే మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు తీసుకోవడం కొద్ది నెలల క్రితం బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపాయి. అయితే ఈ విడాకుల వెనుక రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకొంటున్నారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  English summary
  Trending Filmi news: Tamannaah Bhatia, Pooja Hegde, Ram Gopal Varma, priyamani in top news
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X