Don't Miss!
- Sports
Virat Kohli : కోహ్లీని ఇబ్బంది పెట్టిన బౌలర్.. వీడిని ఆడటం చాలా కష్టమన్న విరాట్!
- News
Bengaluru: అపార్ట్ మెంట్ లో ఏం జరిగింది ?, ఆ ఇద్దరూ ఒకే సారి ఎలా చనిపోయారు ?, భార్య ఎంట్రీతో ?
- Travel
ప్రకృతి రమణీయతకు నిదర్శనం.. హంసలదీవి!
- Technology
ఈ ఆపిల్ మ్యాక్ బుక్ తయారీ నిలిపి వేసిన Apple ! కారణం ఏంటో తెలుసుకోండి!
- Finance
Adani Bonds: అదానీ డాలర్ బాండ్లకు ఎదురుదెబ్బ.. ప్రమోటర్ల తాజా నిర్ణయం ఏమిటంటే..
- Lifestyle
మీ రోజువారీ ఆహారంలో ఈ 9 ఆహారాలు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి...
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సుడిగాలి సుధీర్ రికార్డు బ్రేక్ చేసిన హైపర్ ఆది: ఇద్దరి మధ్య ఏకంగా 30 లక్షలు తేడా!
కొంత కాలంగా తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును అందుకుంటున్నారు. తద్వారా భారీ పాపులారిటీని, వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది ఒకడు. పంచ్‌ల స్పెషలిస్టుగా పేరొందిన అతడు.. సుదీర్ఘ కాలంగా అసాధారణమైన టాలెంట్‌తో అదరగొడుతూ అంచలంచెలుగా ఎదుగుతోన్నాడు.
ఈ క్రమంలోనే ప్రతివారం తనదైన శైలిలో స్క్రిప్టులు రాసుకుంటూ స్కిట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు హైపర్ ఆది.. సుడిగాలి సుధీర్ రికార్డును బద్దలు కొట్టేశాడు. అసలేం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

జబర్ధస్త్ అందరిలో అతడే స్పెషల్
దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షోలో ఎంతో మంది టీమ్ లీడర్లుగా పని చేశారు. అయితే, ఈ కామెడీ షో చరిత్రలోనే హైపర్ ఆదిలా పంచులతో వన్ మ్యాన్ షోలు చేసే వాళ్లు మాత్రం లేరు. అంతేకాదు, తక్కువ సమయంలోనే ఎక్కువ ఎపిసోడ్స్ గెలుపొందిన టీమ్ లీడర్‌గా అతడికి అద్భుతమైన రికార్డు కూడా ఉంది. అందుకే ఈ షోలో ప్రత్యేకం అనిపించుకున్నాడు.
బుచ్చిబాబు సినిమాలో కోచ్‌గా ఎన్టీఆర్: కథ, హీరోయిన్‌తో పాటు ముఖ్యమైన వివరాలన్నీ లీక్

ఇక్కడే కాదు.. అక్కడా టాప్‌లో ఆది
బుల్లితెరపైనే కాదు.. యూట్యూబ్‌లోనూ హైపర్ ఆది స్కిట్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందన్న విషయం తెలిసిందే. పది నిమిషాల పాటు ఉండే అతడి స్కిట్లో లెక్కపెట్టలేనన్ని పంచులు ఉండడం వల్లే అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరుగుతోంది. అతడి స్కిట్ల కోసమే జబర్ధస్త్‌ను చూసే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అందుకే ఆది హవాను కొనసాగిస్తున్నాడు.

సినిమాల్లోనూ సత్తా... అన్ని రకాలు
చాలా ఏళ్లుగా తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్న హైపర్ ఆది.. సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు కూడా చేశాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్ చేశాడు. ఇక, అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు డైలాగ్ రైటర్‌గానూ పని చేశాడు. ఇలా అన్నింట్లోనూ ఉంటూ మరింత పాపులర్ అయిపోయాడు.
మళ్లీ బికినీలో రచ్చ చేసిన పూజా హెగ్డే: ఈ సారి తడిచిన అందాలతో అంతకు మించి!

పుష్పగా మారి రచ్చ చేసేసిన ఆది
జబర్ధస్త్‌లో హైపర్ ఆది ఏ రేంజ్‌లో హడావిడి చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే అంతకు ముందు వారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో అతడు 'పుష్ప' మూవీ స్ఫూఫ్ చేశాడు. ఇందులో ఆది పుష్పరాజ్ గెటప్ వేసుకున్నాడు. అలాగే, ఫాహిమా శ్రీవల్లిగా, శాంతి స్వరూప్ అనసూయగా నటించారు. అంతేకాదు, సినిమాలో కేశవ పాత్ర చేసిన ఆర్టిస్టును కూడా తీసుకొచ్చాడు.

తక్కువ సమయంలోనే కోటీపైగా
హైపర్ ఆది చేసిన 'పుష్ప' స్కిట్‌కు బుల్లితెరపై భారీ స్థాయిలో స్పందన దక్కింది. అదే సమయంలో యూట్యూబ్‌లోనూ ఇది దూసుకుపోయింది. దీంతో దీనికి 24 గంటలు దాటకముందే ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాదు, కేవలం ఆరు రోజుల్లోనే పది మిలియన్స్ అంటే అక్షరాల కోటి వ్యూస్ కూడా దక్కాయి. దీంతో హైపర్ ఆది పేరిట అరుదైన రికార్డు నమోదు అయింది.
మరోసారి రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి అలా పడుకుని మామూలు రచ్చ కాదుగా!
సుధీర్ రికార్డును బ్రేక్ చేసిన ఆది
హైపర్ ఆది మాదిరిగానే సుడిగాలి సుధీర్ కూడా 'పుష్ప' మూవీ స్ఫూఫ్ చేశాడు. అతడి స్కిట్‌కు కూడా భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఆది స్కిట్ కంటే అదే తక్కువ రోజుల్లో 10 మిలియన్ల వ్యూస్‌ను రాబట్టింది. దీంతో సుధీర్ చేసిన స్కిట్టే టాప్‌లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆది స్కిట్ బాగా పుంజుకుంది. దీంతో అతడు రికార్డును కూడా క్రియేట్ చేశాడు.
Recommended Video

సుధీర్ కంటే 30 లక్షలు ఎక్కువగా
ఆదివారానికి సుడిగాలి సుధీర్ చేసిన స్కిట్ యూట్యూబ్‌లోకి వచ్చి 8 రోజులు అయింది. దీనికి మొత్తంగా 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కానీ, హైపర్ ఆది స్కిట్ మాత్రం 9 రోజుల్లో 13 మిలియన్ వ్యూస్‌ను రాబట్టి రికార్డు నమోదు చేసింది. ఇక, వీళ్లిద్దరి మధ్య ఏకంగా 30 లక్షల వ్యూస్ తేడా ఉన్నాయి. దీంతో యూట్యూబ్‌లో తన స్కిట్లకే రెస్పాన్స్ ఎక్కువ వస్తుందని నిరూపించాడు ఆది.