»   » శ్రీహరి మృతి పై ఎన్టీఆర్,రామ్ చరణ్, సమంత ...

శ్రీహరి మృతి పై ఎన్టీఆర్,రామ్ చరణ్, సమంత ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రియల్ స్టార్ శ్రీహరి భౌతికకాయానికి హైదరాబాద్‌లోని నివాసానికి తీసుకువచ్చారు. ఈరోజు(గురువారం) బాచుపల్లిలో శ్రీహరి అంత్యక్రియలు జరుగున్నాయి. శ్రీహరిని కడసారి చూసేందుకు భారీగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన నివాసానికి తరలివస్తున్నారు.

శ్రీహరి మృతి చెందారనే వార్త తెలియగానే యావత్ చిత్రసీమతో పాటు తెలుగువారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తాము విన్న వార్త నిజమేనా? అని ఒకరికి నలుగురిని అడిగి ఖరారు చేసుకుని విచారగ్రస్తులయ్యారు. చక్కని శరీర దారుఢ్యంతో, ఆరోగ్యంగా కనిపించే ఆయన 49 ఏళ్ల పిన్న వయసులో ఇంత హఠాత్తుగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతారని ఎవరి ఊహకీ అందని విషయం. పైగా చిత్రసీమలో అందరికీ ఒక అన్నగానో, తమ్మునిగానో ఆయన మెలుగుతూ వచ్చారు. అందుకే ఆయన్ని ప్రతి ఒక్కరూ 'మా శ్రీహరి' అని సంబోధిస్తారు.


నటుడు శ్రీహరి మరణవార్త తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. మనసున్న మంచి నటుడిని కోల్పోయామంటూ పలువురు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకొన్నారు. వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు శ్రీహరి మరణంపై తమ సంతాపాన్ని ప్రకటించారు.

సినీ ప్రముఖులు సంతాప సందేశాలు..స్లైడ్ షో లో....

రియల్‌గా స్టార్ - ఎన్టీఆర్

రియల్‌గా స్టార్ - ఎన్టీఆర్

"రియల్ స్టార్... రీల్‌లోనే కాదు రియల్‌గా కూడా ఆయన స్టారే. తనతో కలిసి నటిస్తుంటే గొప్ప అనుభూతి కలుగుతుంది. ఆయనతో నటించడం చాలెంజ్‌గా ఉంటుంది. ఆయనతో పరిచయం అయితే చాలు... అది ఎంతో విలువైన బంధంగా మారి పోతుంది. ఆయనతో కలిసి నటించడం గొప్ప అనుభూతి. 'బృందావనం'తో నాకు ఆ అవకాశం దక్కింది. ఆయనతో సన్నివేశం అంటే ఓ సవాలుగా తీసుకొనేవాడిని. ఆయనతో పరిచయం అయితే చాలు, విలువైన బంధంగా మారిపోతుంది. ఆయన మరణం జీర్ణించుకోలేని విషయం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ''

మంచి సహనటుడు- రామ్‌చరణ్‌

మంచి సహనటుడు- రామ్‌చరణ్‌

''మంచి సహనటుడు. ఆయనతో కలిసి నటించడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం. ఎంతో ప్రేమాభిమానాలు ప్రదర్శించే మంచి వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉంది. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటు''.

శాంతి కలగాలి- సమంత

శాంతి కలగాలి- సమంత

''శ్రీహరిగారి మరణవార్త విని తట్టుకోలేకపోయాను. శ్రీహరి ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్నివ్వాలి. వారి కుటుంబానికి శాంతి చేకూరాలి.''.

అన్న లాంటి వాడు- విష్ణు

అన్న లాంటి వాడు- విష్ణు

"శ్రీహరి అన్నకి మా ఫ్యామిలీతో మంచి సంబంధం ఉంది. అన్నలాంటి వాడు. మా ఇద్దరికీ కూడా మంచి అనుబంధం ఉంది. ఎప్పుడూ ఆత్మీయంగా మాట్లాడేవారు. ఆయన లేని లోటు తీరనిది. నా జీవితంలో మర్చిపోలేని చిత్రం 'ఢీ'. ఆ సినిమా అంతలా ఆడిందంటే దానికి కారణం శ్రీహరి అన్నయ్యే. ఆ సినిమాతో మేమిద్దరం అన్నదమ్ములమైపోయాం. ఓ మంచి అన్నయ్యను కోల్పోయాను''

షేర్‌ఖాన్ లేరు- అల్లరి నరేష్

షేర్‌ఖాన్ లేరు- అల్లరి నరేష్

"షేర్‌ఖాన్ లేరనే వార్త విని షాక్ అయ్యాను. మన షేర్‌ఖాన్‌ని కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. . ఆయన లేని లోటు తీరనిది''

గుండె పగిలింది- మనోజ్

గుండె పగిలింది- మనోజ్

"గుండె పగిలినట్టుంది. శ్రీహరి లేరనే బాధను తట్టుకోలేకపోతున్నా. మా కుటుంబంలో ఒకరిగా మెలిగేవారు''

దయగలవాడు- సిద్ధార్థ్

దయగలవాడు- సిద్ధార్థ్

"తెలుగు పరిశ్రమలో శ్రీహరిగారు చాలా దయగలవ్యక్తి. తెలుగు పరిశ్రమలో చాలా దయగల వ్యక్తి. ఆయన లేరన్న వార్త టెర్రిబుల్''

ఇటీవల కలిశా- నిఖిల్

ఇటీవల కలిశా- నిఖిల్

"ఇటీవలే కలిశాను. ఫిట్‌గా కనిపించారు. అంతలోనే లేరంటే నమ్మలేకపోతున్నాను''

మిస్ అవుతున్నా- కోన వెంకట్

మిస్ అవుతున్నా- కోన వెంకట్

"శ్రీహరిగారు పోయారనే వార్త విని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన లేని లోటు బాధాకరం. షాక్‌గా ఉంది.''

మంచి మనిషి- శ్రీనువైట్ల

మంచి మనిషి- శ్రీనువైట్ల

"నటుడిగానే కాదు. వ్యక్తిగతంగానూ నాకు మంచి పరిచయం ఉన్న వ్యక్తి. నేను అసిస్టెంట్ డైరక్టర్‌గా ఉన్నప్పటి నుంచీ ఆయనతో పరిచయం ఉంది. నన్ను బాగా ఇష్టపడేవారు. ఢీ, కింగ్ సినిమాల్లో ఆయన చేసిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఆయన లేని లోటు తీరనిది. ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండే మనిషి. మంచి నటుడు. ఆయన్ని కోల్పోవడం బాధాకరం. నాకు మంచి స్నేహితుడు శ్రీహరి. మనసున్న మంచి వ్యక్తి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా''

దిగ్భ్రాంతి చెందాను- దిల్‌రాజు

దిగ్భ్రాంతి చెందాను- దిల్‌రాజు

"మా సంస్థలో ఆయన 'బృందావనం' చేశాను. నటుడు, నిర్మాత అనే కాకుండా ఆయనతో వ్యక్తిగతంగా నాకు సత్సంబంధం ఉంది. నేను, అరవింద్‌గారు కలిసి నిర్మించే సినిమాలో కూడా ఆయన నటించారు. 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఆరోగ్యం సహకరించడం లేదని నెల ముందు చెప్పారు. ఆరోగ్యం కుదుటపడుతుందిలే అనుకున్నాం కానీ ఇంతలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. వినగానే దిగ్భ్రాంతికి గురయ్యాను''

బాధాకరం- దేవిశ్రీ ప్రసాద్

బాధాకరం- దేవిశ్రీ ప్రసాద్

"శ్రీహరిగారి గురించి విని షాక్‌కు గురయ్యాను. చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్నివ్వాలి''

నన్ను చూసినట్టుంది- కృష్ణంరాజు

నన్ను చూసినట్టుంది- కృష్ణంరాజు

"చిన్న పాత్రలు పోషిస్తూ పెద్ద పాత్రలు చేసే స్థాయికి ఎదిగిన నటుడు శ్రీహరి. ఆయన జీవితాన్ని చూస్తే నా జీవితాన్ని చూసుకున్నట్టు అనిపించింది. నా బ్రహ్మనాయుడు సినిమా ద్వారానే వెండితెరకు పరిచయమయ్యాడు.''

క్రమశిక్షణగల నటుడు- సుమన్

క్రమశిక్షణగల నటుడు- సుమన్

"కలిసి చాలా సినిమాలు చేశాం. నాకు మంచి మిత్రుడు. సన్నిహితుడు. ఆయన మరణించారని తెలిసి చాలా బాధాపడుతున్నాను. క్రమశిక్షణ గల నటుడు.''

నేనే పరిచయం చేశా- డా.యం.మోహన్‌బాబు

నేనే పరిచయం చేశా- డా.యం.మోహన్‌బాబు

"శ్రీహరితో నాకు మొదటి నుంచి పరిచయం ఉంది. దాసరి నారాయణరావుగారికి కూడా అతన్ని నేనే పరిచయం చేశాను. మా కుటుంబ సభ్యుడిలా కలిసిపోయాడు. మా విష్ణుతో 'ఢీ' చేశాను. ఎంతో అవినాభావ సంబంధం ఉంది అతనితో. ఆప్తుడిని కోల్పోయానని బాధగా ఉంది. శ్రీహరిలాంటి నటుడు మళ్లీ పుట్టడు. మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లం. ఒకరి బాధల్ని మరొకరం పంచుకొనేవాళ్లం. తను లేడనే వార్త నన్ను షాక్‌కి గురిచేసింది''

ఎంతో ఆప్తుడు - చిరంజీవి

ఎంతో ఆప్తుడు - చిరంజీవి

"మా కుటుంబానికి ఎంతో ఆప్తుడు. ఆయన మరణవార్తను నమ్మలేకపోతున్నాను. శ్రీహరి హఠాన్మరణం నన్ను కలచివేసింది. ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను''

మా శివయ్య- డా.డి.రామానాయుడు

మా శివయ్య- డా.డి.రామానాయుడు

"మా బ్యానర్‌లో 'తాజ్‌మహల్' చేశారు. ఆ సినిమాకు నంది అవార్డు వచ్చింది. 'శివయ్య' సినిమాలోనూ మంచి పాత్ర చేశారు. వెంకటేష్‌బాబుతో చాలా సినిమాలు చేశారు. మంచి నటుడు. మంచి వ్యక్తి. ఆయన లేని లోటు తీరనిది. చిన్న వయసులోనే కన్నుమూయడం బాధాకరం.పాత్రలకు న్యాయం చేసే మంచి నటుడు శ్రీహరి. మా సంస్థలో చాలా సినిమాలు చేశాడు. అతని హఠాన్మరణం ఎంతో బాధకి గురిచేసింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలి''

శ్రీహరి

శ్రీహరి

''శ్రీహరి సార్‌ నా షేర్‌ఖాన్‌. మనసున్న మంచి నటుడిని కోల్పోవడం బాధాకరం''.
- అపూర్వ లఖియా ('తుఫాన్‌' చిత్ర దర్శకుడు)

మా అన్నయ్య ఇక లేరు- సముద్ర

మా అన్నయ్య ఇక లేరు- సముద్ర

"అన్నయ్యతో నేను 'మహానంది'ని చేశాను. నేను పరిశ్రమలో అన్నయ్య అని పిలిచేది శ్రీహరిగారినే. ఇంటికి పిలిచి నా బాగోగులు అడిగే అన్నయ్య ఇక లేరంటే నమ్మలేకపోతున్నాను. షాకింగ్‌గా ఉంది. తెలుగు పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది''

''శ్రీహరి కుటుంబసభ్యుడితో సమానం. ఆయన మరణం అత్యంత బాధాకరం''.- గోపీచంద్‌ మలినేని.

English summary
Tollywood is shocked and has gone into mourning. As the day was to end, the news of actor Srihari's death came in. Actors and industry wallahs have expressed shock and tributes have been pouring…
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu