»   » ఒకేరోజు జైలవకుశ మూడు టీజర్లు.. నందమూరి ఫ్యాన్స్‌కు ట్రిపుల్ బొనాంజా..

ఒకేరోజు జైలవకుశ మూడు టీజర్లు.. నందమూరి ఫ్యాన్స్‌కు ట్రిపుల్ బొనాంజా..

Written By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి అభిమానులకు శుభవార్త, ఎంతో కాలంగా అతృతతో ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పండుగ చేసుకొనే రోజు వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్ర టీజర్ గురువారం అంటే జూలై 6న రిలీజ్‌కానున్నది. అయితే మీరనుకుంటున్నట్టు ఒక టీజర్ కాదు.. ఏకంగా మూడు టీజర్లను రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే ..

మూడు పాత్రల పేరు మీద

మూడు పాత్రల పేరు మీద

ఈ చిత్రంలో జూనియర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు కనుక జై, లవ్, కుశ పేర్ల మీద మూడు టీజర్లను విడుదల చేయాలని నిర్మాత కల్యాణ్ రామ్ నిర్ణయించారు. ఈ టీజర్లు అభిమానులను ఆనందంలో ముంచెత్తుతాయని చిత్ర యూనిట్ పేర్కొనడం గమనార్హం. ఒక్కో టీజర్‌కు ఒక్కో విశేషం ఉంది.


యంగ్ టైగర్ క్యారెక్టర్లను..

యంగ్ టైగర్ క్యారెక్టర్లను..

తొలి టీజర్ జై క్యారెక్టర్‌ను పరిచయం చేస్తుంది. రెండు, మూడో టీజర్ లవ, కుశలను ఇంట్రడ్యూస్ చేస్తుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మూడు రకాల టీజర్లు చిత్ర కథపై ఆసక్తి కలిగించే విధంగా ఉంటాయి. ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగించే విధంగా ఉంటాయి అని పేర్కొన్నారు.హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టులు

హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టులు

యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నివేద థామస్, రాశీ ఖాన్నాలు నటిస్తున్నారు. వీరిద్దరూ యంగ్ టైగర్ పక్కన నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలో మూడో పాత్రకు సంబంధించిన రూపురేఖల తీర్చిదిద్దడానికి హాలీవుడ్ నుంచి మేకప్ టెక్నిషియన్లను రప్పించారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్ నందమూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


ఎన్టీఆర్‌కు ప్రోస్తటిక్ మేకప్

ఎన్టీఆర్‌కు ప్రోస్తటిక్ మేకప్

లార్డ్ ఆఫ్ రింగ్స్, షట్టర్ ఐలాండ్ చిత్రాలకు పనిచేసిన మేకప్ మెన్ వాన్స్ హార్ట్‌వెల్ ఎన్టీఆర్‌కు ప్రోస్తటిక్ మేకప్ చేయడం విశేషం. ప్రతినాయకుడి పాత్రలో కనిపించే పాత్రకు సంబంధించిన ఫొటో ఇప్పటికే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. తెరపైన ఈ క్యారెక్టర్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి, కొత్త అనుభూతికి గురిచేస్తుంది. ఎన్టీఆర్ నటనా ప్రతిభను మరోసారి గుర్తు చేస్తుంది అని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పారు.English summary
On July 6, the most-anticipated teaser of NTR’s Jai Lava Kusa will be released. Interestingly, NTR’s fans are in for a treat as the makers of the film have confirmed that not one but three teasers will be released over the course of next few weeks. NTR plays triple role in the film and his characters’ names are Jai, Lava and Kusa. The first teaser will introduce Jai’s character and the other two teasers will introduce the other two characters. It is believed that the film will have a separate teaser that will give audiences a glimpse of the story and other key characters.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu