»   » కోరికలు, ఆశలు దాచుకోకూడదు: త్రిష

కోరికలు, ఆశలు దాచుకోకూడదు: త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా స్టార్ ని అయినంత మాత్రాన పంజరపు చిలకలా బతకాలని లేదు కదా" అంటున్నారు త్రిష. ఇటు తెలుగు అటు తమిళ చిత్రాలు చేస్తూ షూటింగ్ లతో బిజీగా వుంటూ తాజాగా బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టారు. కాబట్టి ఇక కెరీర్ 'మూడు పువ్వులు ఆరు కాయలు"గా ఉంటుందని చెప్పొచ్చు. సంవత్సరం పొడవునా షూటింగ్ లతో బిజీగా ఉండే త్రిష 'రిలాక్సేషన్" కోసం పది పదిహేను రోజులు విరామమం తీసుకొంటూ ఉంటారు.

ప్రతి సంవత్సరం ఈ మాత్రం గ్యాప్ ఆమెకి కచ్చితంగా కావలంటోది. దాని గురించి చెబుతూ 'మొహానికి రంగు వేసుకున్నంత మాత్రాన మనసుకి కూడా రంగేసుకుని కోరికలను దాచుకోలేం కదా. మాకూ అందరి అమ్మాయిల్లా స్వేచ్చగా ఉండాలని ఉంటుంది. కానీ వీలుపడదు కదా. అందుకే విదేశాలకు వెళ్లిపోయి హాయిగా రిలాక్స్ అవుతుంటాను. అలా ఉండటం వల్ల కొత్త ఉత్సాహాం వస్తుంది. బడలిక పోతుంది. దాంతో తొలి సినిమాకి పని చేసినంత చురుకుగా చేయగలుగుతాను. ఇంకో వంద సినిమాలు చేసిన ఫీలింగ్ మాత్రం తొలి సినిమా చేసినంత ఉత్సాహంగా చేయాలంటే ఇలా రిలాక్స్ కాక తప్పదు" అంటూ సినీ ఫిలాసఫి చెబుతోంది త్రిష.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu