»   » పవన్ కళ్యాణ్ ‘లవ్ లీ’ పై మోజుపడ్డ బావ..!?

పవన్ కళ్యాణ్ ‘లవ్ లీ’ పై మోజుపడ్డ బావ..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ లో జెండా ఎగరేద్దామనుకొన్న త్రిష ఆశలు నెరవేరలేదు. హిందీనాట తన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో మళ్లీ దక్షిణాది చిత్రాలపై దృష్టి సారించింది త్రిష. తెలుగు, తమిళ చిత్రాల్లో అవకాశాలొస్తున్నాయి. గ్లామర్‌ తో పాటు నటనకూ అవకాశం ఉన్న పాత్రలే చేస్తా అని చెబుతున్నప్పటికీ అందాలు ఆరబోయడానికి పెద్దగా అభ్యంతరం లేదనే సంకేతాలు పంపుతోంది. ప్రస్తుతం జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో 'లవ్ ఆజ్ కల్" రీమేక్ 'లవ్ లీ" చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ సరసన నటిస్తోంది. త్రిష ముంగిట్లో మరో రెండు తెలుగు చిత్రాల అవకాశాలున్నాయి. తేజ దర్శకత్వంలో వెంకటేష్‌ ఓ చిత్రంలో నటించనున్నంది. ఇందులో త్రిషని కథానాయికగా ఎంచుకొన్నట్టు సమాచారం. ఈ చిత్రానికి 'సావిత్రి' అనే పేరు పరిశీలిస్తున్నారు. సిద్దార్థతో దిల్‌ రాజు నిర్మించే చిత్రంలోనూ ఈ అమ్మడే నాయిక. 'నాతో మళ్లీ నటిస్తావా..?' అంటూ సిద్దార్థ‌ స్వయంగా ట్విట్టర్‌ లో త్రిషకి ఆహ్వానం కూడా పంపాడట. వెంకీ, సిద్దూలతో త్రిష ఇది వరకు చేసిన చిత్రాలు బాక్సాఫీసు దగ్గర విజయం సాధించాయి. మరి ఈ కొత్త సినిమాలు కూడా అదే ఫలితం పునరావృతం చేస్తే తెలుగునాట త్రిష జోరు మళ్లీ మొదలైనట్టే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu