»   » త్రిషను ఫైనలైజ్ చేయలేదట

త్రిషను ఫైనలైజ్ చేయలేదట

Posted By:
Subscribe to Filmibeat Telugu
Trisha front runner for Queen remake
హైదరాబాద్ :కంగనారనౌత్ హీరోయిన్ గా బాలీవుడ్‌లో విజయవంతమైన క్వీన్ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రీమేక్ హక్కుల్ని ప్రముఖ దర్శకనిర్మాత త్యాగరాజన్ (హీరో ప్రశాంత్ తండ్రి) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆయన ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలన్నింటిలో తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో త్రిష ఖరారు అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. అయితే అది నిజం కాదని, కేవలం మీడియా సృష్ణే అని త్యాగరాజన్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

త్యాగరాజన్ మాట్లాడుతూ.... క్వీన్ రీమేక్‌లో హీరోయిన్ ఎవరనే విషయంపై మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌ను ఇంకా నిర్ణయించలేదు. కాజల్, తమన్నా, అనుష్కలు నటించబోతున్నారనే వార్తలు వచ్చాయి. వాటిలో వాస్తవం లేదు. క్వీన్ చిత్రంలో కంగనరనౌత్ పాత్రకు న్యాయం చేసే హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నాం. ప్రస్తుతం త్రిష పేరు పరిశీలనలో వుంది. హీరోయిన్ విషయంలో త్వరలో స్పష్టతనిస్తాం. దర్శకుడెవరనే విషయాన్ని కూడా త్వరలో వెల్లడిస్తాం అన్నారు. ప్రశాంత్ జులాయి సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నాడని, ప్రస్తుతం తాను జీన్స్-2 చిత్రాన్ని నిర్మించే సన్నాహాల్లో వున్నానని చెప్పారు త్యాగరాజన్.


కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించగా సూపర్ హిట్టయిన బాలీవుడ్ ఫిల్మ్ 'క్వీన్' తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కాబోతోంది. రెండు రోజుల్లో పెళ్లి కాబోతుందనగా వరుడు మనసు మార్చుకుని, పెళ్లి చేసుకోలేనని చెప్పినప్పుడు పారిస్‌లో హనీమూన్ కోసమని ముందుగానే బుక్ చేసుకున్న టిక్కెట్‌కు ఉపయోగించుకుని ఒంటరిగా పారిస్ వెళ్లిన ఓ యువతి ప్రయాణం ఎలా సాగింది? ఆ ప్రయాణంలో ఎదురైన సంఘటనలతో ఎలా ఆమె స్వతంత్ర వ్యక్తిగా రూపుదాల్చిందనే అంశంతో దర్శకుడు వికాస్ బెహల్ రూపొందించిన 'క్వీన్' విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణనూ అమితంగా పొందింది.

కాగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమాకి వికాస్ బెహల్ రచనా సహకారాన్ని అందించనున్నాడు. "ప్రపంచంలోని ప్రతి మూలలోనూ ఓ రాణి (క్వీన్) ఉంది. అందుకే ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. ఉదాహరణకు బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు చాలా మంది దీన్ని కొరియన్ సినిమాగా భావించారు. అప్పుడే 'క్వీన్' ఒక యూనివర్సల్ స్టోరీ అని నాకు అర్థమైంది. తెలుగు, తమిళ భాషల రీమేక్ హక్కుల కోసం ఇద్దరు నిర్మాతలు నన్ను సంప్రదించినప్పుడు, సరేనని చెప్పాం'' అని తెలిపాడు వికాస్. కాగా ఈ భాషల్లో 'క్వీన్'ను ఎవరు రీమేక్ చేయబోతున్నారనే సంగతిని ఆయన వెల్లడించలేదు.

English summary

 
 Trisha Krishnan is the front runner to reprise Kangna Ranaut’s role in the Tamil remake of the Queen. Several actresses, including Nayanthara, Tamannaah Bhatia, Samantha Ruth Prabhu and Hansika Motwani, were said to have been considered for the coveted role, but the producers have reportedly zeroed in on Trisha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu