»   »  అంత గ్లామర్ నేను కనిపించలేదు:త్రిషా

అంత గ్లామర్ నేను కనిపించలేదు:త్రిషా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Trisha

త్రిషాలో ఒక్కసారిగా విప్లవాత్మక మార్పు వచ్చింది. ఇన్నాళ్లు ఇతర హీరోయిన్లంటే ఇంతెత్తున ఎగిరిపడే త్రిషా ఇపుడు వేదాంత ధోరణిలో మాట్లాడుతోంది. నయనతార పై పొగడ్తలు కుమ్మరిస్తోంది. బిల్లా సినిమాలో నయనతార ఎంతో గ్లామరస్ గా కనిపించిందంటూ చెబుతోంది. నయనతార గ్లామర్ ముందు నమిత మాసిపోయినట్టు కనిపించిందని త్రిషా అంటోంది.

బిల్లా సినిమాలో నయనతార పాత్రపై కామెంట్ చేయమనగా త్రిషా అమాయకంగా బదులిచ్చింది. మొఝి సినిమాలో జ్యోతిక చేసినటువంటి పాత్ర నాకు కూడా చేయాలనిపిస్తుంది...అభియమ్ నానుమ్ సినిమాలో అలాంటి అవకాశం నాకు కూడా వచ్చింది...ఇప్పటి నుంచి మంచి కథల చిత్రాలకే పనిచేస్తాను..ఆ చిత్రంలో నా క్యారెక్టర్ ప్రాధాన్యత కలదై ఉండాలి...గ్లామర్ పాత్రలు అంటే ఇపుడు పెద్దగా ఇష్టం లేదు...కొంతకాలం గడిచాక అభిరుచిలో మార్పు వస్తుంది...చెప్పుకోవాలంటే సిమ్రాన్ ఒక్కోసారి గ్లామరస్ పాత్రలో కనిపిస్తుంది...ఆ వంటనే అద్భుతమైన పాత్రలో కనిపిస్తుంది...కన్నాథిల్ ముత్తమిథాల్ సినిమాలో ఆమె చేసిన పాత్ర అద్భుతం...సిమ్రాన్ ను నా రోల్ మోడల్ గా తీసుకుంటాను. బిల్లా సినిమాలో విష్ణువర్థన్ నయనతారను చాలా అందంగా చూపించాడు...క్యాస్ట్యూమ్స్ లో అందంగా కనిపించే నటి ఎవరంటే కచ్చితంగా అది నయనతారే అని చెప్పవచ్చు...బిల్లా సినిమాలో నయనతార కనిపించినంత అందంగా నేనెప్పుడూ కనిపించలేదు...అని నిజాయితీగా చెప్పింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X