»   » వ్రతం చెడినా త్రిషకు ఫలితం దక్కుతుందో, లేదో...?

వ్రతం చెడినా త్రిషకు ఫలితం దక్కుతుందో, లేదో...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్రిష ఈమధ్య రెచ్చిపోయి మరీ పత్రికలకి పోజులిస్తోంది. సౌత్ నుంచి వచ్చే మేగజైన్లకే కాకుండా, ముంబై నుంచి వచ్చే మేగజైన్లకి కూడా హాట్ హాట్ పోజులిస్తూ అందరి మతులూ పోగొడుతోంది. ఈ ఫొటో సేషన్లకి ప్రత్యేకంగా టైం కూడా కేటాయిస్తోంది. త్రిష ఇప్పుడు ఎందుకిలా రెచ్చిపోతూ పోజులిస్తోందన్న విషయాన్ని ఎంక్వైర్ చేస్తే అసలు విషయం బయటపడింది. తన సెక్సీ లుక్కులతో బాలీవుడ్ దృష్టిలో పడడానికట!

తను నటించిన తొలి హిందీ సినిమా 'కట్టా మీటా' పెద్ద ఫ్లాప్ అవడంతో ఈ చెన్నై భామ ఆమధ్య బాగా అప్ సెట్ అయింది. మళ్లీ అంతలోనే తేరుకుని, ఏది ఏమైనా బాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయిందట. అందుకని అక్కడ సినిమా అవకాశాలు పొందడానికి ఇప్పుడిలా హాట్ హాట్ గా కనిపిస్తోంది. 'సౌత్ కీ, హిందీకీ కాస్త తేడా వుంది. అక్కడ సక్సెస్ కావాలంటే బాగా హాట్ గా కనపడాలి. లేకపోతే కష్టం. అందుకే ఈ ప్రయత్నాలు' అంటోంది నవ్వుతూ. మరి, వ్రతం చెడినా త్రిషమ్మకు ఫలితం దక్కుతుందో, లేదో చూద్దాం!

English summary
South Indian actress Trisha Krishnan, who made her Bollywood debut with Akshay Kumar-starrer Khatta Meetha, is angry after her name was dragged in a drug scandal and thinks it's an attempt to tarnish her image. Trisha thinks this an attempt to malign her name in the Telugu film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu