»   » అంతా బూతే!: త్రిష లేదా నయనతార ఈ వారమే

అంతా బూతే!: త్రిష లేదా నయనతార ఈ వారమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళనాడులో సంచలన విజయం సాధించిన త్రిష లేదా నయనతార చిత్రం ఈ నెల 5న తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో దాదాపు 300ల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా, ‘ఈరోజుల్లో, బస్టాప్ చిత్రాల్లో నటించిన ఆనందిని(రక్షిత) హీరోయిన్‌గా, బెంగలూరు మోడల్ మనీసా యాదవ్ మరో హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో కామియో ఫిలింస్, రిషి మీడియా సంస్థలు ఈ సినిమా తెరకెక్కించారు.

ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు సంగీత దర్శకుడిగానే పరిచయం ఉన్న జివి.ప్రకాష్ కుమార్ ‘త్రిష లేదా నయనతార' సినిమా హీరోగా పరిచయం కాబోతున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని భారీ పబ్లిసిటీతో రుషి మీడియా అధినేత కృష్ణ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా తమిళంలో విడుదలైన ఈ సినిమా కుర్రకారును ఆకట్టుకునే బూతు కంటెంటు ఎక్కువగా ఉందనే విమర్శలు ఎదుర్కొంది. మరి తెలుగులో ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

Trisha Leda Nayanathara release date

సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ...హీరో జి.వి.ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యంలోనే రూపొందిన అద్భుతమైన సంగీత బాణీలకు ప్రముఖ గేయరచయితలు రామజోగయ్య శాస్త్రి, వెన్నెలకంటి, శ్రీమణి, రాఖీ సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో సోనీ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యి పాటలు మంచి ఆదరణ పొందుతున్నాయి. మాస్ ను విపరీతంగా ఆకట్టుకునే విధంగా ఈ పాటలు చిత్రీకరించబడ్డాయి అన్నారు.

సిమ్రాన్ ఈ చిత్రంలో ప్రాధాన్యత గల లీడ్ రోల్ చేసింది. హీరో ఆర్య, హీరోయిన్ ప్రియానంద్ గెస్ట్ పాత్రలతో కనిపించనున్నారు. ఈ నెల 5న భారీ పబ్లిసిటీతో దాదాపు 300 థియేటర్లలో విడుదలకు ప్లాన్ చేసుకుంటున్నాము. జి.వి.ప్రకాష్, ఆనందిని(రక్షిత), మనీషా యాదవ్, సిమ్రాన్, ఆర్య (గెస్ట్) ప్రియాఆనంద్ (గెస్ట్) నటించిన ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, వెన్నెలకంటి, శ్రీమణి, రాఖీ, సంబాషణలు: శశాంక్ వెన్నెలకంటి, ఫోటోగ్రఫీ: రిచర్డ్ ఎమ్ నాదన్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఆదిక్ రవిచంద్రన్: కృష్ణ.

English summary
GV Prakash, Aanandi starrer Trisha Leda Nayanathara releasing on 5 November.
Please Wait while comments are loading...