For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిశ్చితార్థం విషయమై త్రిష తల్లి స్పందన

  By Srikanya
  |

  చెన్నై: కోలీవుడ్,టాలీవుడ్ లలో గత రెండు రోజులుగా ఒకటే హాట్ టాపిక్ గా రన్ అవుతోంది. అది మరేదో కాదు...త్రిష కు నిశ్చితార్దం జరిగింది అనీ. ఈ విషయమై త్రిష ఖండించినా కాదు..నిజమే అంటూ ఫొటోలు,వీడియోలు చూపుతున్నారు. ఈ నేపధ్యంలో త్రిష తల్లి ఉమాకృష్ణన్‌ మీడియాతో మాట్లాడింది

  .త్రిషకు నిశ్చితార్థం అయినట్లు కొన్ని పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. 'వాయై మూడి పేసవుం' నిర్మాత, పారిశ్రామికవేత్త వరుణ్‌ మణియన్‌తో నిశ్చితార్థం జరిగిందని సమాచారం. త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని త్రిష, ఆమె తల్లి ఉమాకృష్ణన్‌ చెబుతున్నారు.

  ఉమాకృష్ణన్‌ మాట్లాడుతూ.. 'అవాస్త ప్రచారం సాగుతోంది. త్రిష జీవితంలో ఇలాంటి ఘట్టం వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క మీడియాకు చెబుతాను. అందులో సందేహం లేదు'ని అన్నారు.

  మరోవైపు మరోవైపు త్రిష, వరుణ్‌ అన్యోన్యంగా ఉన్నారంటూ వచ్చిన ఫొటోలు కూడా ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అంతేకాకుండా అమ్మడు నిశ్చితార్థ ఉంగరంతో ఉన్నట్లు వచ్చిన ఛాయాచిత్రాలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

  'నాకు నిశ్చితార్థం అయినట్లు వస్తున్న వార్త నిజం కాదు. అలాంటి విషయం జరిగితే.. ఆ సమాచారం తొలుత నా నుంచే బయటకు వస్తుంద'ని త్రిష ట్విట్టర్‌లో ప్రస్తావించారు.

  'లేసా లేసా' చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి త్రిష. తమిళంలో కమల్‌హాసన్‌, విజయ్‌, అజిత్‌, విక్రం, సూర్యతోపాటు పలువురు అగ్రహీరోలతో ఆడిపాడిందీ అమ్మడు. తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ వంటి పెద్ద హీరోలతోనే కాదు.. కుర్ర హీరోల సరసన కూడా చిందులేసింది. తాజాగా బాలకృష్ణతో ఓ చిత్రంలో నటిస్తోంది.

  ముందు సినిమా తరువాతే పెళ్లి అంటున్నారు చిరునవ్వుల చిన్నది నటి త్రిష. ఈమెలో ప్రత్యేకత ఏమిటంటే సినిమాకు పరిచయం అయినప్పడు నవనవలాడుతూ ఎంత అందంగా ఉన్నారో నేటికీ మాయని అందాన్ని మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. నటిగా దశాబ్ద కాలం దాటినా నేటికీ హీరోయిన్‌గా తన స్థానాన్ని పదిల పరచుకుంటున్నారు. త్వరలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబుకు జంటగా నటించడానికి రెడీ అవుతున్నారు.

  ఈ ముద్దుగుమ్మ ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే తెలుగు చిత్రంలో నటించారు. అదే విధంగా శింబు సరసన ఇప్పటికే విన్నై తాండి వరువాయో చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు సక్సెస్ అయ్యాయి. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటం సహజమే.

  పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్ నిర్మించనున్న ఈ చిత్రం గురించి త్రిష మాట్లాడుతూ తన అభిమాన దర్శకుల్లో సెల్వరాఘవన్ ఒకరన్నారు. అలాంటి దర్శకుడితో మరోసారి కలసి పని చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సెల్వరాఘవన్ నెల క్రితం ఈ చిత్ర కథ చెప్పారన్నారు. కథ చాలా నాలెడ్జీగా ఉందనిపించిందని అన్నారు. దశాబ్దం దాటినా హీరోయిన్‌గా వరుస అవకాశాలు వరిస్తున్నాయి. మరి పెళ్లి సంగతేమిటన్న ప్రశ్నకు తనకు సినిమానే ఫస్ట్ అని మ్యారేజ్ తరువాత అని త్రిష పేర్కొనడం విశేషం.

  Trisha mother rubbishes engagement rumours

  త్రిష ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే...

  త్రిష కు చెప్పుకోతగ్గ పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. అయినా ఆమె తన రెమ్యునేషన్ విషయంలో మాత్రం ఏ మాత్రం రాజీ పడలేదని సమాచారం. బాలకృష్ణ తో చేస్తున్న గాడ్సే చిత్రం కోసం ఆమెకు ఇచ్చిన ఎమౌంట్ గురించే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు కోటి పాతిక లక్షలు వరకూ పే చేసారని తెలుస్తోంది. మొదట నిర్మాతలు అంత పే చేయటానికి ముందుకు రాలేదని అయితే బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి వారిని ఒప్పించి, ఆమెను తన సినిమాలోకి తీసుకున్నారని వినిపిస్తోంది.

  త్రిష తమిళంలో ఓ చిత్రం చేస్తోంది. అందులో త్రిష తన అభిమానులకు ఆనందం కలిగించేలా స్పెషల్ లేదా ఐటం సాంగ్ చేస్తోంది. ఆ చిత్రం మరేదో కాదు..అజిత్ తో గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న చిత్రం. ఈ చిత్రం అనుష్క హీరోయిన్ కావటం విశేషం. ఈ విషయాన్ని తన మైక్రో బ్లాగింగ్ సైట్ ద్వారా సంగీత దర్శకుడు హ్యారీస్ జైరాజ్ తెలియచేసారు.

  'తల' అజిత్‌ 55వ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఆ సినిమాకు పేరుపెట్టకపోయినా.. 'తల - 55' పేరుతో ఇప్పటికే పోస్టర్లు, బ్యానర్లు నగరంలో భారీగా దర్శనమిస్తున్నాయి. గౌతంమీనన్‌ దర్శకత్వంలోని ఈ సినిమాలో అనుష్క కథానాయిక. త్రిష ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇందులో ఆమె ఓ ప్రత్యేక గీతంలో చిందులేసినట్లు సమాచారం.

  గౌతంమీనన్‌ దర్శకత్వంలో 'కాక్క కాక్క' వంటి పలు సినిమాలలో అవకాశాలు వచ్చినా.. కొన్ని కారణాల వల్ల అజిత్‌ నటించలేదు. చాలా కాలం తర్వాత వారి కాంబినేషన్లో యాక్షన్‌ కథాంశంతో దీన్ని తెరకెక్కించారు. అజిత్‌ పోలీసు పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ డాన్‌ మెక్కాతర్‌ ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. హ్యారీస్‌ జయరాజ్‌ సంగీతం సమకూర్చారు.

  షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం. క్లెమాక్స్‌ సన్నివేశాలను హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. రెండు పాటలు, కొన్ని ప్యాచ్‌ సన్నివేశాలే ఉన్నాయి. ఈ నెలాఖరులో సినిమా పేరు ప్రకటించి.. ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. క్రిస్మస్‌ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

  English summary
  Trisha mother said she don't knew about engagement. She quashed rumours of her daughter supposed secret engagement to producer businessman Varun Manian in a hush-hush ceremony. Trisha who is currently shooting for untitled Telugu film with Balakrishna took to Twitter to clear the air.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X