»   »  తాగుబోతు రమేష్ కన్ఫర్మ్ చేసాడు

తాగుబోతు రమేష్ కన్ఫర్మ్ చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : సరాదాగా సాగిపోయో కామెడీ వేషాలు వేసుకునే ఆర్టిస్టులు హీరోలుగా మారడం మనకు కోత్తేం కాదు. మెన్నటి బ్రహ్మనందం, ఆలీ నుండి, నిన్నటి సునిల్ వరకు కమిడియన్ స్థాయినుండి హీరోల వరకు ఎదిగినవారే. ఇప్పుడు ఇందులోకి మరోక నటుడు వస్తున్నాడు. అతనే సత్యం రాజేష్.

త్రిష హీరోయిన్ గా గోవి గోవర్థన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాయకి సినిమాలో సత్యం రాజేశ్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సంగతిని తాగుబోతు రమేశ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా సత్యం రాజేశ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, రాజేష్ తో తను కలిసున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. దానికి సంబందించిన ఈ పోస్ట్ ని ఇక్కడ మీరు చూడండి.

Nayaki సినిమా తో నాయకుడి గా పరిచయం అవుతున్న మా 'సత్యం రాజేష్' కి ALL THE BEST :)

Posted by Thagubothu Ramesh Official on Wednesday, December 30, 2015

హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యం రాజేష్ సరసన సుష్మా రాజ్ నటిస్తోంది. త్రిష సరసన వెంట్రామన్ నటిస్తున్నాడు. హత్యకు గురై దెయ్యంగా మారిన మహిళ గురించి సినిమా సాగుతుంది. 1980 నాటి కథతో సినిమా సాగుతుంది. ఈ చిత్రాన్ని రాజ్ కందుకూరి, గిరిధర్ నిర్మిస్తున్నారు. తెలుగు తమిళంలో ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Trisha Nayiki hero Satyam Rajesh

లవ్‌ యూ బంగారంతో పరిశ్రమకు పరిచయమైన దర్శకులు గోవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. త్రిష ప్రధాన పాత్రలో హారర్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘నాయకి'. తమిళ్‌తోపాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

విభిన్నమైన కాన్సెప్టు తో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఖచ్చితంగా ప్రేక్షకులను భయపెడతానని అంటోంది గ్లామర్ భామ త్రిష. సౌతిండియాలో స్టార్ హీరోయిన్ రేంజి వరకు వెళ్లి ఓ వెలుగు వెలిగిన త్రిష....గత పదేళ్లుగా సినీ ఇండస్ట్రీలో తన హవా కొనాగిస్తోంది. కొత్త హీరోయిన్లు ఎంత మంది వచ్చినా, ఎంత పోటీ ఉన్నా త్రిష మాత్రం తనకు తగిన పాత్రలు ఎంచుకుంటూ నిలదొక్కుకుంటూనే ఉంది.

English summary
Satyam Rajesh turns as a hero with Trisha's Nayiki confirmed by Thagubothu Ramesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu