»   » నా కలల రాకుమారుడు గ్రీకువీరుడులా ఉండాలి...

నా కలల రాకుమారుడు గ్రీకువీరుడులా ఉండాలి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

గ్రీకువీరుడు...నా రాకుమారుడు...అంటూ సాంగులు సింగుతున్నారు త్రిష. కాబోయేవాడి గురించి కలలు కంటూ...ఆమె ఇలా పాడుతున్నారు. ఏంటి...? కెరీర్ స్పీడ్‌గా సాగుతుంటే...అప్పుడే పెళ్ళి ఏమిటనుకుంటారా, కాదు, కాదు, తనకు కాబోయేవాడి ఉండాల్సిన లక్షణాల గురించి చెబుతున్నారు త్రిష. పెళ్లికి సిద్ధమై కాదు. 'దానికింకా సమయం చాలా ఉంది" అంటున్నారు త్రిష.

ఇంకా మరికొన్ని లక్షణాల గురించి త్రిష చెబుతూ- 'ఆరు అడుగుల ఎత్తుతో గ్రీకువీరునిలా ఉండాలి. అందంతో పాటు చక్కని వ్యక్తిత్వం కూడా ఉండాలి. హాయిగా జీవితాన్ని సాగించడానికి కావాల్సినంత ఆదాయం కలిగిఉన్నవాడై ఉండాలి. అన్నింటికీ మించి మంచి సెన్సాఫ్ హ్యూమర్ గల వ్యక్తి అయి ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉన్న వాడు దొరికితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా. ప్రస్తుతానికైతే...నా దృష్టి మొత్తం కెరీర్‌ పైనే. మరో విషయం ఏంటంటే...సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోను"అని కరాఖండీగా చెప్పేశారు త్రిష. ఇంతకీ ఆ గ్రీకు వీరుడు ఎక్కడున్నాడో..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu