»   » బోయపాటి శ్రీను జూ ఎన్టీఆర్ ల‘గర్జన’లో త్రిష...

బోయపాటి శ్రీను జూ ఎన్టీఆర్ ల‘గర్జన’లో త్రిష...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇంత వరకు మెగా హీరోలతో మెయిన్ హీరోయిన్ గా చేయలేకపోయాననే కొరతని 'లవ్ లీ" సినిమాతో తీర్చుకున్న త్రిష త్వరలో నందమూరి వారి కాంపౌండ్ లోను అడుగుపెట్టి టాలీవుడ్ టాప్ ఫ్యామిలీస్ అన్నిటితోను జత కట్టిన ఘనత దక్కించుకోవాలని చూస్తోంది. నటిగా చాలా ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ ఈ రెండు కుటుంబాలకి ఇంతదాకా త్రిష పై కన్ను పడకపోవడం విశేషమే అనుకోవాలి.

ఎన్టీఆర్ తో బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్న విషయం విదితమే. కెఎస్ రామారావు నిర్మించనున్న ఈ చిత్రానికి 'గర్జన" అనే టైటిల్ ని ఖరారు చేశారట. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన త్రిష కథానాయికగా నటించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో పరాజయం పాలైన తర్వాత త్రిష దక్షిణాది చిత్రాలవైపే ఎక్కువగా మొగ్గు చూపుతోంది. ఈనేపథ్యంలో మంచి సినిమాలకు గేలం వేస్తోందట. ఆ గేలానికి 'గర్జన" పడిందని చెప్పొచ్చు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu