»   » త్రిష కెరీర్‌లో ఇటువంటి రోల్ చేయలేదు, త్వరలో డైరెక్ట్ తెలుగు: కమల్ హాసన్

త్రిష కెరీర్‌లో ఇటువంటి రోల్ చేయలేదు, త్వరలో డైరెక్ట్ తెలుగు: కమల్ హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చీకటి రాజ్యం సినిమా వివరాలను అందించారు. చీకటి రాజ్యంలో త్రిష చేసిన పాత్ర ఆమె తన కెరీర్‌లో ఇప్పటి వరకూ చేయలేదని ఆయన చెప్పారు. సినిమాలో యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయని చెప్పారు. ఈ సినిమాలో ప్రత్యేకమైన మేనరిజాలు ఏవీ ఉండవని ఆయన అన్నారు.

trisha played a different role in her career: Kamal hassan

చీకటి రాజ్యం రెండు గంటల సినిమా అని చెప్పారు. సినిమాను ముప్పై రోజుల్లో నిర్మించామని అన్నారు. స్టైలింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఆయన తెలిపారు. తమిళంలో ఈ సినిమా పాటలు అన్నీ హిట్టయ్యాయని అన్ారు. ఇందులో హితబోధలు ఏమీ చేయలేదని అన్నారు.

trisha played a different role in her career: Kamal hassan

త్వరలోనే తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్నట్లు చెప్పారు. జనవరిలో షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. అమల, జరీనా వహబ్ వంటి వారు ఈ సినిమాకు పనిచేస్తారని అన్నారు. మూడు నెలల్లో సినిమా నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. హిందీలో కూడా చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు.

అసహనం దేశంలో ఇప్పటిది కాదని, 1947 నుంచి ఉందేనని, దానివల్లనే రెండు దేశాలు అయ్యాయని అన్నారు. దేశ విభజన మంచిది కాదని ఆయన అన్నారు. ప్రతీ ఐదేళ్లకోసారి మత అసహనం గురించి చర్చిస్తామని అన్నారు. తాను మతపరమైన వ్యక్తిని కానని అన్నారు.

trisha played a different role in her career: Kamal hassan

చీకటి రాజ్యం తమిళంలో తూంగావం పేర నిర్మితమైంది. ఈ థ్రిల్లర్ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా నటించాడు. తప్పిపోయిన తన కుమారుడి కోసం అన్వేషించే తండ్రి పాత్రను కమల్ హాసన్ పోషించాడు.

English summary
Tamil actor Kamal Hassan said that the role played by Trisha in Cheetati Rajyam is totally different in her career
Please Wait while comments are loading...