»   » డ్యాన్సే ప్రాణమంటున్న శ్రియకు త్రిష సపోర్ట్!?

డ్యాన్సే ప్రాణమంటున్న శ్రియకు త్రిష సపోర్ట్!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్యాన్స్ చేయడమంటే ఆమెకు మక్కువ ఎక్కువట. కమల్ హాసన్, జయప్రద జంటగా నటించిన 'సాగరసంగమం" విక్టరీ వెంకటేష్, భానుప్రియ జంటగా నటించిన 'స్వర్ణకమలం" టైపులో పూర్తిస్తాయిలో డ్యాన్స్ కి ప్రాధాన్యమున్న సినిమాలో నటించాలన్నదే ఆమె కోరిక, ఆ కోరిక ఇప్పటి దాకా తీర్చుకోలేకపోయాను అంటోంది శ్రియ. అయితే అప్పుడప్పుడు సినిమాల్లో కొన్ని పాటల్లో డ్యాన్స్ కి ప్రాధాన్యం ఉంటున్నా డ్యాన్స్ నేపద్యంలో తెరకెక్కే సినిమా కోసం ఎదురుచూస్తున్నా అంటోంది అందాల భామ శ్రియ.

అయితే క్లాసికల్ డ్యాన్స్ లో తనకున్న ప్రావీణ్యాన్ని అప్పుడప్పుడు సినిమాల్లో ప్రదర్శిస్తూనే ఉన్నానని, స్టేజీలపై ప్రదర్శనలూ ఇస్తున్నానని చెబుతోన్న శ్రియ, క్లాసికల్ డ్యాన్స్ పై యువతలో ఆసక్తిని పెంచేందుకు ఓ అకాడమీని స్థాపించాలనుకుంటోంది. అయితే దానికి ఇప్పుడు సమయం కాదని, దానికి కొంత సమయం పడుతుందని, ఇంకో నాలుగైదేళ్ల తర్వాతే డ్యాన్స్ అకాడమీని స్టార్ట్ చేస్తానంటోంది శ్రియ. దీనికంటే ముందు డ్యాన్స్ కు ప్రాదాన్యమున్న సినిమాను స్వీయ నిర్మాణంలో తీస్తానని చెబుతోంది. ప్రస్తుతానికి నటిగా తనకు తీరికలేదని, కొంత గ్యాప్ దొరికిన తర్వాతే ఆ సినిమా గురించి ఆలోచిస్తానని చెప్పుబుతోంది.

ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతోన్న 'డాన్ శీను" లో శ్రియ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మొదటగా త్రిష కథానాయికగా నటించాల్సి వుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ అనుకున్న టైమ్ కు ఆరంభం కాకపోవడంతో త్రిష డేట్స్ తాచుమారు అయ్యాయి. దాంతో ఈ సినిమా నుంచి తను తప్పుకుంది ఆ స్థానంలోనికి శ్రియ వచ్చిదిం. త్రిష, శ్రియ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. బహుశా తను తప్పుకున్న తర్వాత శ్రియ ను పెట్టుకోమని త్రిషనే రికమండ్ చేసిందని పరిశీలకలు అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu