»   » త్రిష 'దోపిడి' మొదలెట్టే రోజు...

త్రిష 'దోపిడి' మొదలెట్టే రోజు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో త్రిషకున్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి మరో తమిళ చిత్రం డబ్బింగై రిలీజ్ కు రెడీ అవుతోంది. తమిళంలో విడుదలై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న కురువై అనే చిత్రాన్ని తెలుగులో 'దోపిడి' పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ స్టార్ విజయ్ హీరోగా చేసారు. ఈ 'దోపిడి' చిత్రం సెన్సార్ సహా నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ పూర్తిచేసుకుని, ఈ నెల 26న విడుదలకు సిద్ధమైంది. అభి పిక్చర్స్ పతాకంపై బి. సత్యనారాయణ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఇక ఈ చిత్ర కథ గురించి నిర్మాత చెపుతూ...ఒక సాదాసీదా కుటుంబంలో పుట్టిన యువకుడు చెడు మార్గాల ద్వారా డబ్బుని ఆర్జిస్తున్న ఒక ఘరానా వ్యక్తిని 'దోపిడి' చేసి, ఎలా గుణపాఠం చెప్పాడనేది ఈ చిత్ర కథాంశం అన్నారు. అలాగే పూర్తి కమర్షియల్ హంగులతో, ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమా రూపొందింది. విజయ్ చేసే ఫైట్లు, త్రిష గ్లామర్, ఎంటర్ ‌టైన్ ‌మెంట్, పాటలు ఈ చిత్రానికి హైలైట్స్" అని చెప్పారు. మాళవిక మరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ధరణి డైరక్ట్ చేసారు. ఇక త్రిష, ఆర్య కాంబినేషన్ లో వచ్చిన మరో ఫ్లాఫ్ చిత్రం సర్వంను కూడా తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu