»   » అప్పలరాజు అనుకున్న టైటిల్ నే... త్రిష కొత్త సినిమాకు

అప్పలరాజు అనుకున్న టైటిల్ నే... త్రిష కొత్త సినిమాకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :త్రిష తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ ,హర్రర్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్రిష పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టీం ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసారు. త్రిష లేడీ ఓరియెంటెడ్ హర్రర్ సినిమాకి ‘నాయకి' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ‘నాయకి' టైటిల్ గుర్తుందా..గతంలో రామ్ గోపాల్ వర్మ తీసిన కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం అప్పలరాజు లో అప్పలరాజు తీసే చిత్రం టైటిల్ ఇది. ఈ టైటిల్ తో అప్పలరాజు సినిమా లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయటమే ఆ చిత్రం కథ. చివర్లో ఈ నాయకి సినిమాకు అవార్డు కూడా వస్తుంది.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకి తెలుగులో ‘లవ్ యు బంగారం' సినిమా చేసిన గోవి దర్శకత్వం వహించనున్నాడు. ‘లక్ష్మీరావే మా ఇంటికి' సినిమా తీసిన మామిడిపల్లి గిరిధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇదే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

వ్యక్తిగత విషయానికి వస్తే...

త్రిష,రానా ల మధ్య ఎఫైర్ ఉందని, అది పెళ్లి దాకా వెళ్లి ఆగిపోయిందని ఆ మధ్య ఓ రేంజిలో రూమర్స్ వినిపించాయి. అంతలోనే ఆమె ఈ బ్రేక్ అప్ అనంతరం అర్జెంటుగా చెన్నై కు చెందిన వ్యాపార వేత్త తో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఇంతలోనే ఏమైందో ఏమో వీరిద్దరు మాట్లాడుకోవటం మానేసారు. ఆ విషయం ప్రక్కన పెడితే త్రిష...తన 32 వ పుట్టిన రోజుని జరుపుకుంది. ఆ పుట్టిన రోజుకు రానా ...విషెష్ తెలిపాడు. అప్పుడు త్రిష ..అతన్ని ఓ సైకో అని సంభోదిస్తూ ధాంక్యూ సైకో ట్వీట్ చేసింది. మీరే చూడండి క్రింద.

ఇక మ్యారేజ్ విషయానికి వస్తే...

గత కొద్ది రోజులుగా త్రిష- వరుణ్‌ మణియన్‌ల పెళ్లి విషయం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య పెళ్లికి ముందే అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయినట్లు సిని,మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ నేపధ్యంలో వీరి సన్నిహితులు ముందుకు వచ్చి...వీరిని కలిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చిన్న చిన్న అభిప్రాయ భేధాలు ఎవరి మధ్య అయినా సహజమేనని, సర్దుకుపోవాలని రాజీ చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

Trisha’s horror film gets a title


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వరుణ్ మణియన్ ...రాజీకు ఇష్టపడినా, త్రిష మాత్రం పట్టుదలగా ఉందని అంటున్నారు. అయితే అసలు వీరిద్దరి మధ్యా ఏం జరిగింది.. అప్పుడే ఎందుకు విడిపోయాలి అనే ఆలోచనకు అప్పుడే ఎందుకు వచ్చారనేది మాత్రం అర్దం కావటంలేదని అంటున్నారు. కానీ సన్నిహితులు మాత్రం...వీరిద్దరూ కలిసి ట్విట్టర్ ద్వారా కానీ ,మీడియా ద్వారా కానీ స్పందిస్తే బాగుంటుందని సూచిస్తున్నారట.

త్రిష.. చిత్ర నిర్మాత వరుణ్‌ మణియన్‌తో ప్రేమాయణం సాగించి, నిశ్చితార్థం చెన్నైలో ఈ ఏడాది జనవరి 23న జరిగింది. ఆ తర్వాత సినీ ప్రముఖులు, స్నేహితులకు ఓ నక్షత్ర హోటల్‌లో విందు కూడా ఇచ్చారు. ప్రస్తుతంఅంతేకాకుండా కొన్ని ప్రముక తమిళ పత్రికలు కూడా వీరిద్దరూ విడిపోయారంటూ వార్తలు ప్రచురించాయి.

ఇటీవల వరుణ్‌మణియన్‌ చెల్లెలు వివాహానికి కూడా త్రిష హాజరు కాలేదని, అంతేకాకుండా త్రిష తన చేతిలో ఉన్న నిశ్చితార్థ ఉంగరాన్ని కూడా తీసేశారన్నది ఆ వార్తల సారాంశం. మరోవైపు వీరిద్దర్నీ కలిపేందుకు సన్నిహిత స్నేహితులు ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

త్రిషకు వరుణ్‌మణియన్‌తో వివాహ నిశ్చితార్థానికి ముందు పెద్దగా చిత్రాలు లేవు. అంతకుముందు అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి పెళ్లికి సిద్ధం అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత త్రిష నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం విడుదలైన హిట్ అవ్వడంతో పాటు ఆమెకు మంచి పేరు వచ్చింది. మేనేజర్ గిరిధర్ నిర్మిస్తున్నారు. త్రిష చిత్రాలు మీద చిత్రాలు అంగీకరించడంతో ఆమె పెళ్లి గురించి రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనం రాసింది. అయితే ఈ వ్యవహారం గురించి ఇటు త్రిషగాని, అటు వరుణ్‌మణియన్‌గాని స్పందించక పోవడం గమనార్హం.

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో హవా చాటుకుంటున్న త్రిష.. ఇప్పటికీ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. తెలుగులో బాలకృష్ణ సరసన ఆమె నటించిన 'లయన్‌' త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు తమిళంలోనూ కొత్తగా రెండు చిత్రాల్లో నటిస్తోంది.

English summary
Trisha will be doing a horror film. The makers have now officially announced that the film has been titled ‘Nayaki’.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu