»   » పెళ్లి గురించి, రానా గురించి... త్రిష చెప్పిన ఆసక్తికర విషయాలు!

పెళ్లి గురించి, రానా గురించి... త్రిష చెప్పిన ఆసక్తికర విషయాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా సినీ తారలు అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడం, వీరితో చిట్ చాట్ చేయడం, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ త్రిష కూడా తన అభిమానులతో చిట్ చాట్ చేసింది.

ఈ సందర్బంగా త్రిష అభిమానులు, మూవీ లవర్స్...త్రిషను వివిధ రకాల ప్రశ్నలతో ముంచెత్తారు. ఇందులో త్రిష లవ్ లైఫ్, పెళ్లి విషయాలతో పాటు..... రానా గురించి కూడా ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు త్రిష ఆచితూచి సమాధానం ఇచ్చింది. ఎలాంటి కాంట్రవర్సీకి చోటివ్వకుండా ఓపికగా సమాధానాలు చెప్పింది.

కొందరు అభిమానులు త్రిషకు లవ్ ప్రపోజల్ కూడా చేసారు. త్రిష వీటన్నింటికీ ఎలాంటి సమాధానాలు చెప్పింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి తదితరుల గురించి త్రిష స్పందన ఎలా ఉంది అనే అంశాలు స్లైడ్ షోలో...

రానా దగ్గుబాటి

రానా దగ్గుబాటి

రానాతో కలిసి నటిస్తావా? అనే ప్రశ్నకు త్రిష పాజిటివ్ గా స్పందించింది.

పెళ్లి..

పెళ్లి..

పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ఓ అభిమాని ప్రశ్నించగా...నేను బాగా ఇష్టపడే వ్యక్తి దొరికినప్పుడు అని సమాధానం ఇచ్చింది.

తెలివిగా...

తెలివిగా...

త్రిష అభిమాని ఒకరు....వివాదాస్పద ప్రశ్నను తనదైన రీతిలో అడిగాడు. దానికి త్రిష ఇలా పబ్లిక్ గా ఆ విషయం చెప్పలేను అంటూ సమాధానం ఇచ్చింది.

ఎవరిని చేసుకోబోతున్నారు.

ఎవరిని చేసుకోబోతున్నారు.

పెళ్లి ఎవరిని చేసుకోబోతున్నారు అనే ప్రశ్నకు.....త్రిష నేను కూడా అతనెవరో తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నాను అంటూ సమాధానం ఇచ్చారు.

సినిమాల తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్

సినిమాల తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్

సినిమాల తర్వాత ప్లాన్స్ ఏమిటని అడగ్గా...ఇద్దు పిల్లలు, ఒక జంతుశాల, ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడం అని సమాధానం ఇచ్చింది.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని అడగ్గా...అతన్ని పొగడ్తలతో ముంచెత్తింది.

చిరంజీవి గురించి

చిరంజీవి గురించి

చిరంజీవి గురించి అడగ్గా....మెస్ట్ హెల్ప్ ఫుల్ కోస్టార్ అంటూ సమాధానం ఇచ్చింది.

మహేష్ బాబు గురించి

మహేష్ బాబు గురించి

మహేష్ బాబు తో పని చేయడం ఎలా ఉందని అడగ్గా... చాలా ఎంజాయ్ చేసామంటూ సమాధానం ఇచ్చింది.

10 ఏళ్లుగా నిన్నే ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటావా?

10 ఏళ్లుగా నిన్నే ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటావా?

ఈ ప్రశ్నకు త్రిష సమాధానం ఇస్తూ....అలా ప్రేమిస్తూనే ఉండు, పెళ్లి చేసుకోవడం ఎందుకు అంటూ సమాధానం ఇచ్చింది.

ప్రేమలో పడాలి

ప్రేమలో పడాలి

నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ఓ అభిమాని అడగ్గా...అది జరుగాలంటే ముందుగా నీతో ప్రేమలో పడాలి అంటూ సమాధానం ఇచ్చింది.

English summary
Trisha Krishnan too joined the latest trend of twitter chat sessions. Trisha interacted with her fans on twitter in a long chat session and answered many funny and interesting questions.
Please Wait while comments are loading...