For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గాఢంగా... : త్రిష తన ఉడ్ బి తో తొలి సెల్ఫీ(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : నటి త్రిష, పారిశ్రామికవేత్త- సినీ నిర్మాత వరుణ్‌లకు ఈనెల 23వ తేదీన వివాహ నిశ్చితార్థం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా వీరిద్దరూ కలిసి సరదగా ఇదిగో ఇలా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్పీ చూస్తూంటే వీరిద్దరూ ఎంత గాఢంగా ప్రేమలో మునిగి తేలుతున్నారో అర్దం అవుతోంది. మీరూ ఆ ఫొటోని ఇక్కడ చూడండి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  'నీ మనసు నాకు తెలుసు' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన త్రిష, తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌ వంటి అగ్రహీరోలతోనూ పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌ వంటి ఆ తర్వాతి తరం హీరోలతోనూ నటించింది. ఇప్పటికీ తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ సరసన 'లయన్‌' చిత్రంలో నటిస్తోంది.

  Trisha & Varun Manian's first selfie

  'వాయై మూడి పేసవుం' తమిళ చిత్ర నిర్మాత వరుణ్‌ మణియన్‌తో త్రిష ప్రేమాయణం సాగిస్తున్నట్లు, ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగినట్టు గతంలో వార్త లొచ్చాయి. అప్పట్లో ఈ వార్తలను త్రిష, ఆమె తల్లి ఉమా కృష్ణన్‌ కూడా ఖండించారు. ఈ నేపథ్యంలో తన నిశ్చితార్థం జరగనున్న విషయాన్ని త్రిష ట్విట్టర్‌లో ప్రకటించింది.

  'రానున్న 23న వరుణ్‌తో నా నిశ్చితార్థం జరగనుంది. పెళ్లి తేదీ ఇంకా ఖరారు చేయలేదు. ఇష్టమొచ్చిన తేదీలను రాయొద్దని కోరుకుంటున్నా. సినిమాల నుంచి విరమించుకునే ఆలోచన ప్రస్తుతం నాకు లేదు. త్వరలోనే రెండు కొత్త చిత్రాలకు సంతకాలు చేయనున్నా. నేను నటించిన నాలుగు కొత్త చిత్రాలు ఈ ఏడాది తెరపైకి రానున్నాయి. వాటి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'నని చెప్పింది.

  కెరీర్ విషయానికి వస్తే...

  త్రిష కు చెప్పుకోతగ్గ పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. అయినా ఆమె తన రెమ్యునేషన్ విషయంలో మాత్రం ఏ మాత్రం రాజీ పడలేదని సమాచారం. బాలకృష్ణ తో చేస్తున్న చిత్రం కోసం ఆమెకు కోటి పాతిక లక్షలు వరకూ పే చేసారని తెలుస్తోంది. మొదట నిర్మాతలు అంత పే చేయటానికి ముందుకు రాలేదని అయితే బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి వారిని ఒప్పించి, ఆమెను తన సినిమాలోకి తీసుకున్నారని వినిపిస్తోంది.

  త్రిష తమిళంలో ఓ చిత్రం చేస్తోంది. అందులో త్రిష తన అభిమానులకు ఆనందం కలిగించేలా స్పెషల్ లేదా ఐటం సాంగ్ చేస్తోంది. ఆ చిత్రం మరేదో కాదు..అజిత్ తో గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న చిత్రం. ఈ చిత్రం అనుష్క హీరోయిన్ కావటం విశేషం. ఈ విషయాన్ని తన మైక్రో బ్లాగింగ్ సైట్ ద్వారా సంగీత దర్శకుడు హ్యారీస్ జైరాజ్ తెలియచేసారు.

  'తల' అజిత్‌ 55వ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఆ సినిమాకు పేరుపెట్టకపోయినా.. 'తల - 55' పేరుతో ఇప్పటికే పోస్టర్లు, బ్యానర్లు నగరంలో భారీగా దర్శనమిస్తున్నాయి. గౌతంమీనన్‌ దర్శకత్వంలోని ఈ సినిమాలో అనుష్క కథానాయిక. త్రిష ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇందులో ఆమె ఓ ప్రత్యేక గీతంలో చిందులేసినట్లు సమాచారం.

  గౌతంమీనన్‌ దర్శకత్వంలో 'కాక్క కాక్క' వంటి పలు సినిమాలలో అవకాశాలు వచ్చినా.. కొన్ని కారణాల వల్ల అజిత్‌ నటించలేదు. చాలా కాలం తర్వాత వారి కాంబినేషన్లో యాక్షన్‌ కథాంశంతో దీన్ని తెరకెక్కించారు. అజిత్‌ పోలీసు పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ డాన్‌ మెక్కాతర్‌ ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. హ్యారీస్‌ జయరాజ్‌ సంగీతం సమకూర్చారు.

  షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం. క్లెమాక్స్‌ సన్నివేశాలను హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. రెండు పాటలు, కొన్ని ప్యాచ్‌ సన్నివేశాలే ఉన్నాయి. ఈ నెలాఖరులో సినిమా పేరు ప్రకటించి.. ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. క్రిస్మస్‌ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

  English summary
  Trisha and Varun Manian who will be getting engaged on January 23rd this year posed for a selfie in this fashion.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X