»   »  త్రిష సీక్రెట్ కోరిక రివీలైంది

త్రిష సీక్రెట్ కోరిక రివీలైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముఖ్యమంత్రి కావాలని ఆశగా ఉంది చెన్నై బ్యూటీ త్రిషకు. హీరోయన్లు మహా అయితే ఐదారేళ్లు రాణించగలరు. అలాంటిది 15 ఏళ్లుగా హీరోయిన్ కి స్థానంలోనే నెట్టుకొస్తున్న ఈ సొగసరికి.. సీఎం కావాలనే కోరిక మాత్రం బలంగా ఉందంట. ఈ విషయం తనే వెల్లడించింది.

ఈ బ్యూటీ తాజాగా ధనుష్‌కు జంటగా నటించిన కొడి చిత్రం నేడు విడుదలైంది. విశేషం ఏమిటంటే ఇందులో ఆ అమ్మడు రాజకీయనాయకురాలిగా నటించారు. ఆ మూవీ ప్రభావమో ఏమోగానీ.. మనసులోని మాట చెప్పిందీ అమ్మడు. అయితే కేవలం వెండితైరపై సీఎం గా చూసుకోవాలనుకుంటోందా లేక నిజంగానే నిజ జీవితంలోనూ సీఎం అవ్వాలని ఉన్నట్లుంది ఈ అమ్మడుకు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

త్రిష ఏమంటోందంటే''అప్పట్లో జయలలిత చదువుకున్న చెన్నైలోని చర్చ్ పార్క్ కాన్వెంట్‌లోనే నేనూ చదువుకున్నా'' అని ఈ చెన్నై బ్యూటీ పేర్కొన్నారు. అదే విధంగా ఈ మధ్య ముఖ్యమంత్రి చేతుల మీదగా అవార్డు కూడా అందుకుందీ ఈ సుందరీ. ఒకవేళ జయలలిత బయోపిక్ తీస్తే? ఆమె పాత్రలో నేను నటిస్తానంటూ త్రిష ఆసక్తి కనబరుస్తున్నారు. పదిహేనేళ్ల కెరీర్‌లో పలు రకాల పాత్రలు చేశారు త్రిష. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జయలలిత బయోపిక్‌లో నటించాలనుందని చెప్పారు.

English summary
Trisha claims she studied in the same school where Jayalalithaa has done her schooling. She also expresses her wish to play lead role in Jaya's biopic.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu