»   » పవన్ 'కోబలి'లో శాతవాహనుల తర్వాత కాలం నాటి...

పవన్ 'కోబలి'లో శాతవాహనుల తర్వాత కాలం నాటి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ ఏమిటీ అంటే పవన్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న కోబలి చిత్రం. ఈ చిత్రం గురించి త్రివిక్రమ్ మరింతి ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ చిత్రంలో తెలుగు భాష గురించి పూర్తి కేర్ తీసుకుంటామని,అందుకే స్క్రిప్టు లేటు అవుతుందని చెప్పారు. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం 'అత్తారింటికి దారేది' విజయాన్ని ఆస్వాదిస్తున్నారు . పవన్‌కల్యాణ్‌తో హీరోగా ఆయన తెరకెక్కించిన 'అత్తారింటికి దారేది' వంద కోట్ల క్లబ్‌లో చేరనుందనేది ట్రేడ్ పండితుల విశ్లేషణ.

త్రివిక్రమ్ మాట్లాడుతూ.... 'కోబలి' కథ ఇంకా ప్రిలిమినరీ స్టేజస్‌లోనే ఉంది. శాతవాహనుల తర్వాత కాలం నాటి లాంగ్వేజ్‌ను, కప్పట్రాల ఆ ప్రాంతాల్లో వాడిన అచ్చమైన తెలుగును వాడుతున్నాం. ఇప్పటికీ ఆ ఏరియాలో అందమైన తెలుగు వినిపిస్తుంది. మెహబూబ్‌నగర్‌లోని పలు గ్రామాల్లో కూడా తెలుగు భాష సౌందర్యం వినిపిస్తూనే ఉంటుంది. లాంగ్వేజ్‌పై రీసెర్చ్ జరుగుతోంది. కోబలి స్క్రిప్ట్‌కే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే సినిమా ఎప్పుడు ప్రారంభిస్తామో చెప్పలేం అన్నారు.

అలాగే కోబలి రెగ్యులర్ ప్యాటర్న్ సినిమా కాదు. నాకూ, పవన్‌గారికి అంతంత రెమ్యూనరేషన్స్ ఇచ్చేవారు ఇలాంటి వాటిని ఇష్టపడతారో? లేదో? అందుకే మేమే ఈ సినిమా చేస్తున్నాం. భవిష్యత్తులోనూ చాలా సినిమాలు చేస్తాం. కొన్ని కథలను నేను ఎంత చేసినా ఇది త్రివిక్రమ్ సినిమాలాగా లేదు అంటారు. త్రివిక్రమ్ సినిమాలాగా ఉండటమంటే ఏంటో నాక్కూడా తెలియదు. కానీ ఆడియన్స్ అలా ఫిక్సయిపోతారు. అలా నా దృష్టిలోకొచ్చిన, పవన్‌గారి దృష్టిలోకొచ్చిన మంచి కథలతో ఈ సంస్థలో సినిమాలు చేస్తాం.

ఇక ఈ చిత్రం పవన్‌తో కలిసి నిర్మిస్తున్నాను. 'కోబలి'... రాయలసీమ ప్రాంతంలో ఈ పదం వినిపిస్తుంటుంది. అంటే అమ్మవారికి బలివ్వడం అన్నమాట. ఈ కథపై పరిశోధన జరుగుతోంది. కొంచెం కష్టంతో కూడిన కథ. ఆ సాహసమేదో మేమిద్దరమే చేయాలనుకొన్నాం. 'కోబలి' సమాంతర చిత్రం అనుకోలేం. అలా అనలేం. అవార్డు సినిమా, సమాంతర సినిమా అంటూ విడగొట్టి చూడడం నాకు ఇష్టం లేదు. మంచి సినిమా, చెడ్డ సినిమా అంతే.వీలైనంత తొందర్లోనే ఈ సినిమాను మొదలుపెడతాం అని చెప్పారు.

English summary

 Reveling the news in latest interview, Trivikram said the story is titled 'Kobali', a word which is used to get inspiration from, especially in the interiors of Rayala Seema region. There is a lot of research needed for the story and we thought we will bear the brunt ourselves instead of involving an outside producer. No, it's not a parallel film but a terrific idea. I hate to divide good ideas into parallel and commercial columns'
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu